
- ఉమ్మడి జిల్లా అబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్ రఘురాం ఆదేశం
ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లాలో మద్యం టెండర్లు సజావుగా చేపట్టాలని ఉమ్మడి జిల్లా అబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్ రఘురాం అధికారులను ఆదేశించారు. కొత్త మద్యం టెండర్ల ప్రక్రియలో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలో దరఖాస్తులు స్వీకరిస్తున్న అబ్కారీ శాఖ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మద్యం టెండర్లలో దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. రెండో శనివారం(11న) కూడా దరఖాస్తులు స్వీకరించనునట్లు తెలిపారు. జిల్లా అబ్కారీ సూపరింటెండెంట్ జ్యోతి కిరణ్, సీఐలు రవి, రమేశ్ కుమార్, సిబ్బంది ఉన్నారు.
కొనసాగుతున్న దరఖాస్తుల స్వీకరణ
జిల్లాలో నూతన మద్యం దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. ప్రభుత్వం సెప్టెంబరు 26 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించగా గురువారం వరకు జిల్లా వ్యాప్తంగా 34 మంది దరఖాస్తులు చేసున్నట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ జ్యోతి కిరణ్ గురువారం పేర్కొన్నారు. జిల్లాలోని 32 మద్యం దుకాణాల దరఖాస్తులకు ఈనెల 18వ తేదీ వరకు గడువు అని, డిసెంబరు 1 నుంచి నూతన మద్యం దుకాణాలు ప్రారంభమవుతాయని తెలిపారు.