యాదాద్రి జిల్లాలో 24 సంఘాలకు భూమి కోసం లోన్లు​

యాదాద్రి జిల్లాలో 24 సంఘాలకు భూమి కోసం లోన్లు​
  •     కొల్లూరు సంఘం భూమి అమ్మడంతో రంగంలోకి  బీసీ కార్పొరేషన్
  •     భూములపై ఆరా.. నిషేధిత జాబితాలో కార్పొరేషన్ల భూమి!

​యాదాద్రి, వెలుగు :  జిల్లోని ‘కొల్లురు’ ఘటన నేపథ్యంలో జీవాల కోసం కో ఆపరేటీవ్​ సొసైటీలకు ఇచ్చిన భూముల పరిరక్షణకు ఆఫీసర్లు చర్యలు చేపడుతున్నారు. ఈ భూములు ఉన్నాయా? అమ్ముకున్నారా? అనేదానిపై ఆరా తీస్తున్నారు.  భూములను అమ్కుండా నిషేధిత జాబితాలో చేర్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో చంద్రబాబు సర్కారు 2003–-04లో ‘కోటి వరాలు’ పేరుతో  కుల వృత్తులకు సంబంధించిన కో ఆపరేటీవ్​ సొసైటీలకు లోన్లు ఇచ్చింది. యాదాద్రి జిల్లాలోని 24  షీప్​ బ్రీడింగ్​ కో ఆపరేటీవ్​ సొసైటీలకు ఒక్కోదానికి రూ. లక్ష చొప్పున లోన్ మంజూరు చేసింది. ఈ సొమ్ముతో ఒక్కో సొసైటీ 4  నుంచి 7 ఎకరాల వరకూ భూములు కొనుగోలు చేసి బీసీ కార్పొరేషన్​కు మార్టిగేజ్​ చేశాయి. ఈ భూములను గొర్రెల మేత కోసం ఉపయోగించుకొని వాటి ద్వారా ఏండ్లుగా ఉపాధి పొందారు. 

భూములపై కొందరి కన్ను

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రియల్​ ఎస్టేట్​ రంగం ఊపందుకుంది. యాదాద్రి జిల్లాలో యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నర్సింహస్వామి టెంపుల్​ పునర్నిర్మాణంతో జిల్లా వ్యాప్తంగా భూములు రేట్లు బాగా పెరిగాయి. ఈ క్రమంలో పడావుగా ఉన్న షీప్​ బ్రీడింగ్​ కో ఆపరేటీవ్​ సొసైటీల భూములపై కొందరి కన్ను పడింది. సబ్సిడీ చెల్లించినందున తమ భూమిని మార్టిగేజ్​ నుంచి తప్పించాలని కార్పొరేషన్​ ఎంప్లాయీస్​ను కొందరు ఆశ్రయించి ఎన్వోసీ పొందారు. ఆ తర్వాత వాటిని మార్కెట్​లో అమ్మకానికి పెట్టినట్టుగా తెలిసింది. ఈ తరహాలో కొన్ని సొసైటీలు భూములను అమ్ముకున్నాయని ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే యాదాద్రి జిల్లా ఆలేరు మండలం కొల్లూరుకు చెందిన మల్లికార్జున షీప్​ బ్రీడింగ్​ కో ఆపరేటీవ్​ సొసైటీకి చెందిన కొందరు ఐదెకరాల భూమిని అమ్మి రిజిస్టేషన్​చేసుకున్న విషయం తెలిసిందే. సొసైటీ మెంబర్ల మధ్య విబేధాలు వచ్చి కలెక్టర్​ కు ఫిర్యాదు చేశారు.  కలెక్టర్​ ఆదేశాలతో బీసీ డెవలప్​మెంట్​ఆఫీసర్​ విచారణ చేపట్టి అమ్మకం వాస్తవమేనని తేల్చారు. ఈ క్రమంలో ఆ భూమి అమ్మిన, కొనుగోలు చేసి వ్యక్తులపై ఆఫీసర్లు చర్యలకు సిద్ధమయ్యారు. 

మిగతా సొసైటీల భూములపై ఆరా...

కొల్లూరు సొసైటీ భూమిని అమ్ముకున్న విష యం వెలుగులోకి రావడంతో జిల్లాలోని మిగ తా సొసైటీల భూములు ఉన్నాయా? అమ్ముకున్నారా? అనే చర్చ మొదలైంది. ఆ భూములకు సం బంధించిన వివరాలను నల్గొండ నుంచి బీసీ కార్పొరేషన్​ ఆఫీసర్లు  తెప్పించి పరిశీలిస్తున్నారు. ఈ భూముల క్రయ విక్రయాలు మళ్లీ జరగకుండా సర్వే నెంబర్లను బ్లాక్​ చేసేలా చర్యలు చేపడుతున్నారు. 

నిషేధ జాబితాలో చేరుస్తాం

సొసైటీ భూమల పరిరక్షణ కోసం చర్యలు తీసుకుంటాం. వాటిని నిషేధిత జాబితాలో చేర్చడానికి నిర్ణయం తీసుకోనున్నాం. కొల్లూరులో అమ్మిన సొసైటీ భూమి కూడా మరోసారి చేతులు మారకుండా ఈ జాబితాలో చేరుస్తాం. - ఎంవీ భూపాల్​రెడ్డి,ఆర్డీవో, భువనగిరి

బాధ్యులపై చర్యలు 

33 జిల్లాల్లో ఉన్న షీప్ పెడరేషన్ భూము ల వివరాలు సేకరించాలని ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చాం. కొల్లూరులో భూ విక్రయంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లకు సూచించాం. భూములు కాపాడడానికి అన్ని చర్యలు తీసుకుంటాం.  - దూదిమెట్ల బాలరాజు యాదవ్​,  తెలంగాణ షీప్స్ అండ్​ గోట్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్