సైలెన్సర్లను మారిస్తే చర్యలు : ఏఎస్పీ చిత్తరంజన్

సైలెన్సర్లను మారిస్తే చర్యలు :  ఏఎస్పీ చిత్తరంజన్

ఆసిఫాబాద్, వెలుగు: సైలెన్సర్లు మార్చి ప్రజలకు ఇబ్బంది కలిగేలా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని  ఏఎస్పీ చిత్తరంజన్ హెచ్చరించారు.  అధిక శబ్ధం వచ్చే 50 బైక్​ల మాడిఫైడ్ సైలెన్సర్లను శుక్రవారం వాంకిడి టోల్ ప్లాజా వద్ద రోలర్ తో ధ్వంసం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైలెన్సర్లను మార్చడం చట్టరీత్యా నేరమన్నారు. 

ఆసిఫాబాద్ డివిజన్ వ్యాప్తంగా తనిఖీలు చేపడుతున్నామని, మాడిఫైడ్ సైలెన్సర్లను వాడితే  క్రిమినల్ కేసులు నమోదు చేసి, వాహనాన్ని సీజ్ చేస్తామని, డ్రైవింగ్ లైసెన్స్​ను రద్దు చేస్తామన్నారు. ఆసిఫాబాద్, వాంకిడి, జైనూర్, రెబ్బెన సీఐలు బాలాజీ వరప్రసాద్,  సత్యనారాయణ, రమేశ్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు