విద్యార్థులతో కలిసి సీఎం స్టెప్పులు

విద్యార్థులతో కలిసి  సీఎం స్టెప్పులు

విద్యార్థులతో కలిసి అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ స్టెప్పులేశారు. ఈ వీడియోను ఆయన తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. విద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేయకుండా ఉండలేకపోయా అంటూ తెలిపారు. ఇపుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. 

ఆదివారం  దిస్పూర్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో ఏర్పాటు చేసిన  విందు కార్యక్రమంలో ఓ ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో అస్సాంలోని టీ కమ్యూనిటీల ట్రెడీషనల్ ఫోక్ సాంగ్ అయిన జుముర్‌కు విద్యార్థులు డ్యాన్స్ చేశారు. దీంతో అక్కడున్న సీఎం వేదికపై నుంచి లేచి వారితో స్టెప్పులేశారు. సీఎం హిమంత బిశ్వ శర్మతో పాటు ఆయన భార్య రినికి భుయాన్ శర్మ కూడా విద్యార్థులతో డ్యాన్స్ చేశారు. చప్పట్లు కొడుతూ విద్యార్థులను ప్రోత్సహించారు. కాసేపు సరదాగా గడిపారు. దీంతో విద్యార్థులు మరింత హుషారుగా స్టెప్పులేశారు.