
రామ్ గఢ్: ఈసారి బీజేపీకి 400కు పైగా సీట్లు వస్తే, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)ను భారత్‌లో విలీనం చేస్తామని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. బుధవారం జార్ఖండ్‌లోని రామ్‌గఢ్‌లో హజారీబాగ్ బీజేపీ అభ్యర్థి మనీశ్ జైస్వాల్ తరఫున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హిమంత మాట్లాడుతూ.. ‘‘2019లో 300కు పైగా సీట్లు ఇస్తే అయోధ్యలో రామమందిరం నిర్మించినం. ఆర్టికల్ 370 రద్దు చేసినం. సీఏఏ అమలు చేసినం. అలాగే ఇప్పుడు 400కు పైగా సీట్లు ఇస్తే పీవోకేను భారత్ లో విలీనం చేస్తాం. శ్రీకృష్ణ జన్మభూమి టెంపుల్, జ్ఞానవాపి టెంపుల్ నిర్మిస్తాం. యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తాం” అని హిమంత బిశ్వ శర్మ చెప్పారు.