2 లక్షల మందిపై వరద ప్రభావం

2 లక్షల మందిపై వరద ప్రభావం

అసోంలో వర్షాలు, వరదలు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని 20 జిల్లాల్లో దాదాపు 2 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో కాచర్ జిల్లాలో ఇద్దరు, దిమా హసావో జిల్లాలో ఒకరు మృతి చెందారు. ఏడు జిల్లాల్లో ఏర్పాటు చేసిన 55 సహాయ శిబిరాల్లో దాదాపు 32,959 మందికి ఆశ్రయం కల్పిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్,స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF)అగ్నిమాపక సిబ్బంది వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 16 చోట్ల కట్టలు తెగిపోయాయి. అనేక ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు,ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. సర్వం కోల్పోయిన బాధితులు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. 

భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటం, రైల్వే ట్రాక్ లపై నీరు నిలిచిపోవడంతో దిమా హసావోలోని లుమ్ డింగ్, బదర్ పూర్ సెక్షన్ లో రెండు రైళ్లు నిలిచిపోయాయి. వాటిల్లో ప్రయాణిస్తున్న 2, 800 మంది ప్రయాణికులను సురక్షితంగా స్వగ్రామాలకు తరలించారు అధికారులు. వర్షాలు, వరదల నేపథ్యంలో పల రైళ్లను అధికారులు నిలిపివేశారు. వర్షాలకు దెబ్బతిన్న రైల్వే ట్రాక్ ల మరమ్మతు పనులు యుద్దప్రాతిపదికన కొనసాగుతున్నాయి.

మరిన్ని వార్తల కోసం

అమెజాన్ ప్రైమ్ లో కేజీఎఫ్ 2 ... కానీ ఓ నిబంధన.. !

10రోజుల పాటు కేటీఆర్ విదేశీ టూర్