మా ఏనుగుల్ని ఎందుకు చంపింది : రైలు ఇంజన్ ను సీజ్ చేసిన అధికారులు

మా ఏనుగుల్ని ఎందుకు చంపింది  : రైలు ఇంజన్ ను సీజ్ చేసిన అధికారులు

అస్సాం ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ అధికారులు రైలు ఇంజన్ ను సీజ్ చేశారు. అటవీశాఖకు చెందిన రెండు ఏనుగుల్ని రైలు ఇంజన్ ఢీకొట్టడంతో అవి అక్కడికక్కడే మృతిచెందినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటన ఇండియన్ రైల్వే తొలిసారి జరిగినట్లు తెలుస్తోంది.

సెప్టెంబర్ 27 హోజాయ్ జిల్లాలో పఠార్ఖోలా రైల్వే స్టేషన్ సమీపంలో రెండు ఆడ ఏనుగులు మరణించాయి. దీంతో అక్టోబర్ 20న ఫారెస్ట్ అధికారి రజిబ్ దాస్ వన్యప్రాణుల రక్షణ యాక్ట్ ప్రకారం  రైల్వే ఇంజన్ ను సీజ్ చేశారు. ప్రజల నిత్యవసర సరుకుల్ని పంపిణీ చేసే లోకో ఇంజన్ ను స్వాధీనం చేసుకోవడం సాధ్యం కానుందన.. సీనియర్ డిఎంఇ  చంద్ర మోహన్ తివారీని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఏనుగులు చనిపోయినందుకు కాను నష్టపరిహారం కింద రూ .12 కోట్లు చెల్లించడానికి అంగీకరించారు.

ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారి రజిబ్ దాస్ మాట్లాడుతూ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా నుంచి వెళ్లే సమయంలో రైలు గరిష్టపరిమితి గంటకు 30 కి.మీ ఉండాలని,కానీ రైలు 60కిలోమీటర్ల అధిక వేగంతో వెళ్లినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. అందుకే తాము రైల్ ఇంజిన్ ను సీజ్ చేసినట్లు తెలిపారు.