జాతీయ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి వేధింపులపై అంకితా దత్తా ఫిర్యాదు

జాతీయ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి వేధింపులపై అంకితా దత్తా ఫిర్యాదు

కాంగ్రెస్ చీఫ్ అంకితా దత్తా తీవ్ర ఆరోపణలు చేశారు. అతడు తనను గత 6 నెలలుగా వేధిస్తున్నారని, తన పట్ల వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పార్టీ అధిష్టానాన్ని పలుమార్లు  ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం అంకితా లేదని ఆరోపించారు. ఇప్పటి వరకు వారిపై ఎలాంటి విచారణ కమిటీ వేయలేదని చెప్పారు. పార్టీ ప్రయోజనాల కోసం ఉన్నా అధిష్టానం మాత్రం సైలెంట్ గా ఉందన్నారు. 

తాను నాలుగు తరాల కాంగ్రెస్ వాదినని అంకితా దత్తా ట్వీట్ లో పేర్కొన్నారు. తానును ఇంటర్నల్ ఆర్గనైషన్ కు రెండుసార్లు పోటీ చేశానని, బూత్ కమిటీని ఏర్పాటు చేశానని చెప్పారు. అంతే కాదు ఒకానొక సందర్భంలో పోలీసుల దెబ్బలు కూడా తిన్నానని తెలిపారు. తాను ఢిల్లీలోని గౌహతి విశ్వవిద్యాలయంలో  పొలిటికల్ సైన్స్ నుంచి ఎల్ఎల్బీ వరకు చేశానని చెప్పారు. పార్టీ ప్రయోజనాల కోసం ఇంతకాలం మౌనంగా ఉన్నానని.. కానీ శ్రీనివాస్ వల్ల వేధింపులు ఆగడం లేదని ట్వీట్ ద్వారా తెలియజేశారు. 

గతంలో ఐవైసీ ప్రెసిడెంట్ కేశవ్ కుమార్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడన్న కారణాలతో మీటూలో భాగంగా అతన్ని తొలగించారని ఈ సందర్భంగా అంకిత గుర్తు చేసుకున్నారు. 6 నెలలుగా శ్రీనివాస్  తనను మానసికంగా వేధింపులకు, వివక్షకు గురి చేస్తున్నారని.. కానీ ఎటువంటి విచారణ ప్రారంభించలేదని చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఆమె ట్యాగ్ చేశారు. రాహుల్ గాంధీపై తనకు చాలా నమ్మకం ఉందని, శ్రీనివాస్ తనపై వేధింపులు, కించపరిచే విధంగా మాట్లాడిన విషయాలు చెప్పేందుకే తాను భారత్ జోడో యాత్ర సందర్భంగా జమ్మూ వెళ్లానన్నారు. కానీ ఇప్పటికీ ఎలాంటి చర్య తీసుకోలేదని అంకిత ఆరోపించారు. శ్రీనివాస్‌పై పార్టీ చర్యలు తీసుకుంటుందని నెలల తరబడి తాను మౌనంగా ఉన్నానని, కానీ ఎవరూ తనకు మద్దతునివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్‌ ముసుగులో అతను ఇంకా అనేక అక్రమాలకు పాల్పడుతున్నాడని చెప్పారు. 

https://twitter.com/ANI/status/1648502326691512321