కిలో టీ పొడి రూ.1.15 లక్షలు.. వేలంలో దక్కించుకున్న హైదరాబాదీ

కిలో టీ పొడి రూ.1.15 లక్షలు.. వేలంలో దక్కించుకున్న హైదరాబాదీ

మన దేశంలో చాయ్ కు ఎంతగా క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. అది ఎంతలా అంటే కిలో టీ పొడికి లక్షలు వెచ్చించేంతగా. అవును. మీరు విన్నది నిజమే. అత్యంత పాపులర్ అయిన అస్సాంలోని మనోహరి గోల్డ్ టీ పొడి ఇటీవల వేలంలో రికార్డు ధర పలికింది. కిలో టీ పొడికి ఏకంగా రూ.1.15లక్షలకు అమ్ముడుపోయింది. అయితే దీన్ని కొనుగోలు చేసింది మరెవరో కాదు.. మన హైదరాబాద్‌కు చెందిన నీలోఫర్‌ కేఫ్‌ యజమాని కె.బాబూరావు.  రికార్డు ధరకు ఈ టీని కొనడంతో ఆయన కూడా పాపులర్ అయ్యారు.  

ఉదయం 4 నుంచి ఉదయం 6 గంటల ప్రాంతంలో టీ గార్డెన్‌లో ఒకే చెట్టుకు కాసిన మొగ్గలు, ఆకులతో ఈ టీ పొడిని తయారు చేస్తామని మనోహరి టీ ఎస్టేట్‌ యజమాని రాజన్‌ లోహియా తెలిపారు.  మనోహరి గోల్డ్‌ టీ పొడితో తయారు చేసిన టీని కప్పు రూ.1000 చొప్పున విక్రయిస్తామని నీలోఫర్ కేఫ్ యజమాని బాబూరావు చెప్పారు. ఇదిలా ఉండగా గతేడాది ఈ టీ పొడి కిలో రూ. 9,999 ధర పలికింది. తాజాగా ఆ రికార్డును బద్దలు కొడుతూ రికార్డు స్థాయి ధర పలికింది.