V6 News

మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు..

మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు..

అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై బీఏసీ సమావేశం ముగిసింది. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మూడు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. 20 రోజుల పాటు  సభ నిర్వహించాలని  కాంగ్రెస్ కోరగా.. మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 4న (శుక్రవారం) వరదలపై చర్చ, 5న బిల్లులపై చర్చించాలని నిర్ణయించారు. ఆదివారం 6న సమావేశాలు ముగించనున్నారు. మూడు రోజుల తర్వాత సభను పొడగించే అంశంపై మరోసారి నిర్ణయం తీసుకోనున్నారు. 

ALSO READ:మంత్రి కేటీఆర్తో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ