భూమి వైపు​ దూసుకొస్తున్న ఆస్టరాయిడ్..

భూమి వైపు​ దూసుకొస్తున్న ఆస్టరాయిడ్..

విమానమంత సైజులో ఉన్న ఆస్టరాయిడ్..

వాషింగ్టన్: పేద్ద  విమానమంత ఆస్టరాయిడ్ (గ్రహశకలం) ఒకటి మన భూమివైపు దూసుకొస్తోందని నాసా సైంటిస్టులు చెప్పారు. బోయింగ్​747 విమానం కంటే పెద్దగా ఉన్న ఈ ఆస్టరాయిడ్​కు వారు ఆస్టరాయిడ్​ 2020 ఆర్​కే2 అని పేరుపెట్టారు. ఇది సెకనుకు 6.68 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందట. మన భూమి తిరుగుతున్న కక్ష్య్యకు చాలా దగ్గరి నుంచే వెళ్లిపోతుందని సైంటిస్టులు చెప్పారు. బుధవారం(ఈ నెల 7న) రాత్రి 10:42 నిమిషాలకు భూ కక్ష్యలో నుంచి వెళ్లిపోతుందన్నారు. భూమి ఉపరితలం నుంచి 38,30,238 కిలోమీటర్ల దూరంలో నుంచి వేగంగా వెళ్లిపోతుందన్నమాట. మళ్లీ 2027 దాకా ఈ ఆస్టరాయిడ్​ భూమివైపు రాదని సైంటిస్టులు చెప్పారు. ఇంత దగ్గరగా వెళుతున్నా కూడా భూమి మీద నుంచి ఆస్ట్రానమర్లు దీనిని చూడలేరట. ఈ ఆస్టరాయిడ్​ వల్ల భూమికి ప్రమాదం జరిగే అవకాశం దాదాపుగా లేదని నాసా ప్రకటించింది. పోయిన నెలలో కూడా స్కూల్​బస్​ సైజున్న ఆస్టరాయిడ్​ భూకక్ష్యకు 20 వేల కిలోమీటర్ల దూరంలో నుంచే వెళ్లింది.