శ్రీ క్రోధి నామ పంచాంగం : వృశ్చిక రాశి ఫలితాలు

శ్రీ క్రోధి నామ పంచాంగం : వృశ్చిక రాశి ఫలితాలు

ఆదాయం : 8
వ్యయం      : 14
రాజపూజ్యం : 4
అవమానం  : 5

విశాఖ 4వ పాదము; అనురాధ 1, 2, 3, 4 పాదములు; జ్యేష్ట 1, 2, 3, 4 పాదములు,మీ పేరులోమొదటి అక్షరం తో, నా, నీ, నూ, నె, నో, యా,  యీ, యు

గురువు 9.4.2024 నుండి 1.5.2025 ఉగాది వరకు మేషరాశి యందు సువర్ణమూర్తిగా సంచారం. శని 9.4.2024 నుండి 29.3.2025 ఉగాది వరకు సువర్ణమూర్తిగా సంచారం. రాహుకేతువులు 9.4.2024 నుండి 29.3.2025 ఉగాది వరకు తామ్రమూర్తులుగా సంచారం.

ఈ రాశి వాళ్లకు సామాన్యంగా ఉంటుంది. రైతులు ముహూర్త బలంతో వ్యవసాయం పనులు చేసుకొనవలెను. వృత్తి, ఉద్యోగ, వ్యాపారులకు సామాన్యం. లాయర్లు, డాక్టర్లు చాలా జాగ్రత్తగా ప్రతి విషయంలో శ్రద్ధగా ఉండాలి. కాంట్రాక్టర్లు టెండర్లు ఒకటికి నాలుగుసార్లు ఆలోచించి వేయండి. రాజకీయ నాయకులు ఎవరికి, ఏవిధమైన హామీలు ఇచ్చినా ఎక్కడో ఒక చోట ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

శుభకార్యముల విషయంలో ధనం నీళ్లలా ఖర్చు చేస్తారు. విందు వినోదాల్లో చాలా తక్కువగా మాట్లాడగలరు. చికాకులు కలిగే అవకాశాలు ఉన్నవి. చాలా జాగ్రత్తగా ఉండగలరు. బిగ్ ఇండస్ట్రీ వాళ్లకి కొంత వరకు అనుకూలంగా ఉంటుంది. స్మాల్ ఇండస్ట్రీ వాళ్లకి అనేక విధములుగా ఇబ్బందులు రాగలవు. బంగారము, వెండి, కాపర్ వ్యాపారులకు కొంతవరకు అనుకూలం. టింబర్​, ఐరన్, సిమెంట్, వస్త్ర వ్యాపారులకు ఆదాయం తగ్గును. మత్స్య పరిశ్రమ బ్యాలెన్స్​గా ఉంటుంది. పౌల్ట్రీ సామాన్యం. చిట్స్ కొంతరకు ఇబ్బందులు ఉన్నవి.

షేర్స్ వాళ్లకి సామాన్య పరిస్థితి. మీరు ప్రారంభించిన పనులు ఆగిపోవుటకు అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. విద్యార్థులకు మార్కులు తక్కువగా రాగలవు. ఎవరైనా సరస్వతీ ద్వాదశ నామాలు చదివిన వాళ్లు ఎక్కువ మార్కులు తెచ్చుకొనగలరు. ఉద్యోగంలో లంచం తీసుకొన్నవాళ్లపై ఏసీబీ దాడులు జరుగును. విశాఖ నక్షత్రం వాళ్లు కనక పుష్యరాగం ధరించవలెను. దక్షిణామూర్తి పూజలు గురువారం శెనగ గుగ్గిళ్లు చేసి అందరికి పంచండి.

అనురాధా నక్షత్రం వాళ్లు ఇంద్ర నీలం ధరించండి. ఎరుపు నువ్వులు కడిగి ఎండపోసినవి కిలోంబావు పూజల అనంతరం దానం ఇవ్వండి. జ్యేష్ట నక్షత్రం వారు జాతి పచ్చ ఉంగరం కుడిచేయి చిటికెన వేలికు ధరించండి. శ్రీ వేంకటేశ్వర స్వామికి పూలతో అలంకరణ చేయించి, చక్కెర పొంగలి ప్రసాదములు నైవేద్యంగా పెట్టండి. మంగళవారం రాత్రి 500 గ్రా. పచ్చపెసలు తెచ్చి నానబెట్టి పావురాలకు దాణాగా వేయండి. అమావాస్య రోజు పితృదేవతలకు తర్పణలు చేయండి. 
అదృష్ట సంఖ్య 9.

చైత్రం : ఈ రాశి వాళ్లకు అనుకూలంగా ఉంటుం ది. ఆటుపోట్లు ఉండగలవు. తొందరపాటు వలన కోర్టు కేసులు రాగలవు. చాలా జాగ్రత్తగా ఉండవలసిన రోజులు. అవసరానికి ధనం సమకూరగలదు. సున్నితంగా మాట్లాడగలరు. గురు పూజలు, దక్షిణామూర్తికి శెనగల గుగ్గిళ్లు ప్రసాదం పెట్టండి.

వైశాఖం : ప్రతి విషయంలో వ్యతిరేకత, అనారోగ్యం. దూర ప్రాంతంలో ఉండవలసి రావచ్చు. చెడు స్నేహితుల వలన అజ్ఞాతవాసం. చెడుకు దూరంగా ఉండండి. విద్యార్థులు సరస్వతీ ద్వాదశ నామజపం చేయండి. శని తైలాభిషేకం ఎరుపు నువ్వులు కడిగి, ఎండపోసినవి దానం ఇవ్వండి.

జ్యేష్టం : శత్రుశేషం పెరిగి ఉన్నది. మిత్రులు కూడా మీరు మాట్లాడే తీరు వల్ల శత్రువులుగా మారగలరు. ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. తప్పనిసరి అనుకుంటే శకునం చూసుకుని శుభ ఘడియల్లో బయలుదేరండి. విష్ణు సహస్ర నామ పారాయణ చేయండి.

ఆషాఢం : ఈ రాశి వాళ్లకి సామాన్యంగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త. వ్యవహారాల్లో ఏమి మాట్లాడినా, ఏదో తెలియని నష్టాలు. వృత్తి వ్యాపారాలందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికీ హామీ ఉండరాదు. నవగ్రహ ప్రదక్షిణలు, దానాలు చేయండి.

శ్రావణం : ఈ రాశి స్త్రీ పురుషులకు సామాన్య లాభం. ప్రతి విషయంలో ఆదాయం కన్నా ఖర్చులు అధికం. వాహన యోగం. విలాసవంతమైన జీవన విధానం ఉండాలి అనుకుంటారు. సత్యదేవుని వ్రతం చేయండి.

భాద్రపదం : అనుకూలంగా ఉంటుంది. ఇతరులతో తక్కువగా మాట్లాడగలరు. ఆకస్మిక ధనలాభం. అనారోగ్య సమస్యలు. పిల్లల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొనగలరు. శనిదేవునికి తైలాభిషేకం చేయండి. పితృ తర్పణలు చేయండి.

ఆశ్వయుజం : అనుకూలంగా ఉన్నది. కాని చాలా జాగ్రత్తగా ఏ విషయంలోనైనా చాకచక్యంగా వ్యవహరించాలి. కొంతవరకు వెసులుబాటు. వస్తు వాహన గృహోపకరమైనవి రాగలవు. అమ్మవారి అనుగ్రహం కోసం పూజలు ఆచరించండి.

కార్తీకం : అనుకూలంగా ఉంటుంది. గృహం, ప్లాట్ ఏదో ఒకటి కావాలని పట్టుదలతో ఉంటారు. అనుకున్న పనుల్లో ఆటంకములు తొలగును. ప్రతి విషయంలో ప్రేమగా ముందుకు రాగలరు. వేంకటేశ్వర స్వామికి అలంకరణ చేసి, చక్కెర పొంగలి ప్రసాదం పెట్టండి.

మార్గశిరం :  వృత్తి వ్యాపారాలందు అనుకూలత. ఆకస్మికంగా డబ్బు చేతికి అందుతుంది. మీకు తెలియని వారి వలన కూడా సాయం పొందగలరు. మహన్యాస పూర్వక రుద్రాభిషేకం చేయించుకొనగలరు.

పుష్యం : ఈ రాశి స్త్రీ పురుషులకు అనుకూలంగా ఉంటుంది. కాని ధనం నిలువదు. ప్రతి విషయంలో చాకచక్యంగా ఉండాలి. అన్నదమ్ములతో అక్కాచెల్లెళ్లతో తక్కువగా మాట్లాడాలి. ఎంత సంపాదించినా ఎటుపోతుందో తెలియదు. గ్రామదేవత పూజలు చేయండి.

మాఘం : అనుకూలంగా ఉంటుంది. సంతానయోగం ఉన్నది. పారిశ్రామిక రంగంలో అనుకూలత. సామరస్య ధోరణితో ఫలితం. సమయ పాలన గురించి తెలుసుకొని ఆచరించండి. నవగ్రహ జప దానములు ఆచరించండి.

ఫాల్గుణమాసం : వ్యాపారంలో సామాన్యం. విందు వినోదములో కొంత జాగ్రత్తలు తీసుకొనగలరు. తొందరపాటు నిర్ణయాలతో కష్టనష్టములు భరించగలరు. ఇంట్లో అఖండ దీపారాధన చేయండి.