వార ఫలాలు.. జూన్ 11 నుంచి 17 వరకు

వార ఫలాలు.. జూన్ 11 నుంచి 17 వరకు

మేషం 

కొత్త విద్యాయత్నాలు సానుకూలం. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. కార్యజయం. బంధువుల నుంచి శుభవర్తమానాలు. ఆదాయం సంతృప్తికరం. వాహనసౌఖ్యం. శుభకార్యాల నిర్వహణకు డబ్బు వెచ్చిస్తారు.  వ్యాపారులకు లాభాలు ఊరిస్తాయి. ఉద్యోగులు విధి నిర్వహణలో అవాంతరాలు అధిగమిస్తారు. కళాకారులు కొత్త అవకాశాలు దక్కించుకుంటారు.

సింహం

అదనపు రాబడి. సన్నిహితులు,స్నేహితులతో కీలక విషయాలు చర్చిస్తారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలం. ముఖ్య కార్యక్రమాలలో విజయం. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు. ఉద్యోగులకు ప్రమోషన్లు రాగలవు. కళాకారులకు కొత్త అవకాశాలు దగ్గరకు వస్తాయి. దూర ప్రయాణాలు.

ధనుస్సు 

కొత్త వ్యక్తులు పరిచయం. శుభకార్యాలకు హాజరవుతారు. స్నేహితులు, బంధువులతోతగాదాలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఒక ప్రకటన నిరుద్యోగులకు వరంగా మారుతుంది. ఆస్తి విషయంలో కొత్త అగ్రిమెంట్లు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు. ఉద్యోగులకు ఆశించినరీతిలో ప్రమోషన్లు. కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి.

వృషభం 

కొత్త వ్యక్తుల పరిచయం. చేపట్టిన కార్యక్రమాలు సమయానికి సాఫీగా పూర్తి. సోదరులు,స్నేహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. వాక్చాతుర్యంతో అందర్నీ మెప్పిస్తారు. సాంకేతిక, పరిశోధనాంశాలపై ఆసక్తి. రాబడి పెరుగుతుంది. గృహయోగం. వ్యాపారులు ఆశించిన పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగులు శ్రమకు ఫలితం దక్కించుకుంటారు.

కన్య 

ఆదాయం సంతృప్తినిస్తుంది. కొత్త కార్యక్రమాలలో విజయం. శుభకార్యాలకు డబ్బువెచ్చిస్తారు. విలువైన సామగ్రి కొంటారు. ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకుంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం.  వ్యాపార విస్తరణయత్నాలు కలసివస్తాయి. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు. కళాకారులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. అనుకోని సన్మానాలు జరుగుతాయి.

మకరం 

అందరిలోనూ విశేష గౌరవం . కార్యజయం. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆదాయానికి లోటు ఉండదు. పలుకుబడి కలిగినవారితో పరిచయాలు. వివాహయత్నాలు సానుకూలం. ఉద్యోగయత్నాలు మరింత అనుకూలం. ఆలోచనలకు కార్యరూపం. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. వ్యాపారులు అందిన లాభాలతో ఉత్సాహంగా సాగుతారు. ఉద్యోగులకు మంచి గుర్తింపు.

మిధునం 

ఆదాయం పెరిగి అవసరాలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం. బంధువులు, స్నేహితులతో మరింత సఖ్యత. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు.  నిరుద్యోగులకు శుభవర్తమానాలు. తరచూ ప్రయాణాలు సంభవం. కొన్ని నిర్ణయాలు మీ జీవనశైలిని మార్చవచ్చు. వ్యాపారులకు అనుకున్న లాభాలు.  ఉద్యోగులకు ప్రమోషన్లు. కళాకారులకు ఊహించని అవకాశాలు.

తుల 

రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. పరపతి పెరుగుతుంది. స్నేహితులనుంచి ముఖ్య సమాచారం. కార్యక్రమాలు అనుకున్నట్టే పూర్తి చేస్తారు. ఆరోగ్య సమస్యలు తీరతాయి. నూతన వ్యక్తుల పరిచయం. భాగస్వామ్య వ్యాపారాలలో అభివృద్ధి. పెట్టుబడులకు సైతం లోటు ఉండదు. ఉద్యోగులకుహోదాలు దక్కుతాయి. రాజకీయవర్గాలకు కొత్త పదవీయోగం. వారాంతంలో  దూరప్రయాణాలు.

కుంభం 

కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. వాహనసౌఖ్యం. శుభకార్యాల్లో పాల్గొంటారు. పాతబాకీలు కూడా వసూలై ఆర్థికంగా బలపడతారు. సన్నిహితుల నుంచి కీలక సమాచారం. వ్యాపారులకు మరిన్ని లాభాలు అందుతాయి.  ఉద్యోగులకు కొత్త హోదాలు, విధుల్లో ఒత్తిడులు తొలగుతాయి. కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి.

కర్కాటకం 

కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. వాహనసౌఖ్యం. శుభకార్యాల్లో పాల్గొంటారు. పాతబాకీలు కూడా వసూలై ఆర్థికంగా బలపడతారు. సన్నిహితుల నుంచి కీలక సమాచారం. వ్యాపారులకు మరిన్ని లాభాలు అందుతాయి.  ఉద్యోగులకు కొత్త హోదాలు, విధుల్లో ఒత్తిడులు తొలగుతాయి. కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి.

వృశ్చికం 

ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాల్లో అవరోధాలు. కష్టం మీది ఫలితం వేరొకరిదిగా ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆస్తి వివాదాలు కొంత జఠిలం కావచ్చు. వ్యాపారులకు ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు ఎదురుకావచ్చు. ఆకస్మిక ధనలాభం. వాహనయోగం.

మీనం 

శుభకార్యాలలో పాల్గొంటారు. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం. రాబడి మరింత ఉత్సాహాన్నిస్తుంది. నైపుణ్యంవెలుగులోకి వస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. స్థిరాస్తి వివాదాలు
తీరతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూలం. వాహనసౌఖ్యం. వ్యాపారులకు అనుకున్న లాభాలు. భాగస్వాములతో వివాదాలు తీరతాయి.

 

వక్కంతం చంద్రమౌళి
జ్యోతిష్య పండితులు
ఫోన్​: 98852 99400