లక్షణాలు లేని వారి నుంచి వైరస్‌ వ్యాప్తి చెందటం అరుదు

లక్షణాలు లేని వారి నుంచి వైరస్‌ వ్యాప్తి చెందటం అరుదు
  • కరోనా వ్యాప్తిపై డబ్ల్యూహెచ్‌వో

జెనీవా: ఎలాంటి లక్షణాలు లేకుండా వైరస్‌ పాజిటివ్‌ వచ్చిన వారి నుంచి వైరస్‌ వ్యాప్తి చెందటం చాలా అరుదు అని వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ వెల్లడించింది. లక్షణాలు లేని బాధితుల నుంచి ఇతరులకు వ్యాధి సోకడం అరుదు అని కరోనా సాంకేతిక విభాగం ఉన్నతాధికారి మారియా వాన్‌ కెర్ఖోవ్‌ అన్నారు. అలాంటి వారి నుంచి 6 శాతం మాత్రమే వైరస్‌ ఇతరులకు సోకుతుందని చెప్పారు. అసింప్టమేటిక్‌ పెషంట్ల నుంచే వైరస్‌ ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని, దాని వల్ల కేసులు పెరిగిపోతున్నాయన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆమె క్లారిటీ ఇచ్చారు. “ మేం పరిశీలించిన డేటా ప్రకారం లక్షణాలు లేని వారి నుంచి వైరస్ సోకడం చాలా అరుదు అని తేలింది” అని జెనీవాలోని డబ్ల్యూహెచ్‌వో ఆఫీస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె స్పష్టం చేశారు.