ఢిల్లీని వణికిస్తున్న చలి

ఢిల్లీని వణికిస్తున్న చలి

ఎప్పుడూ వెదర్ ఛేంజ్ లతో వార్తల్లోకెక్కే ఢిల్లీలో.. ఇప్పుడు ప్రజలు చలికాలంతో ఇబ్బందులు పడ్తున్నారు. ఈ సీజన్ లో అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదుకావడంతో చలితో గజ గజ వణుకుతున్నారు. శనివారం 8.3 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ నమోదయితే.. ఆదివారం 6.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. దీంతో వింటర్ సీజన్ ప్రారంభంలోనే రికార్డు కొట్టింది. యావరేజ్ కంటే రెండు డిగ్రీలు తక్కువగానే నమోదయ్యింది. అదే సమయంలో గాలిలో తేమ 95శాతంగా ఉన్నట్లు ఢిల్లీ వాతావరణ శాఖ ప్రకటించింది. అత్యధిక ఉష్ణోగ్రత 24డిగ్రీలుగా నమోదయ్యింది. మరో వైపు చలి తీవ్రత పెరగడం, పొగమంచు కురుస్తుండటంతో ఆదివారం ఉదయాన్నే వాకింగ్ వెళ్లే వారు.. వాహనాల్లో వెళ్లే వారు రోడ్డు సరిగా కనపడక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అసలే గాలిలో కాలుష్యం పెరగడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఢిల్లీ జనాలు దీనికి తోడు పొగమంచు ఉండటంతో బయటకు రాలేక పోతున్నారు. గాలి కాలుష్యం మాత్రం ఫరిదాబాద్, ఘజియాబాద్, గుర్గావ్, నోయిడాలతో పాటు ఢిల్లీలో ఎప్పటిలాగే సాధారణంగానే ఉంది.