హరితా ప్లాజానా.. మరాఠా ప్లాజానా.. ఎప్పుడు చూసినా వాళ్లే ఉంటున్నారంట..!

హరితా ప్లాజానా.. మరాఠా ప్లాజానా.. ఎప్పుడు చూసినా వాళ్లే ఉంటున్నారంట..!

ప్రగతి భవన్ కు కూతవేటు దూరంలోనే ఉండే హరిత ప్లాజాలో ఇప్పుడు మరాఠీలే ఎక్కువగా కనిపిస్తున్నారట. ఏ టైమ్ లో చూసినా వాళ్లే దర్శనమిస్తున్నారట. ఎవరైనా రూమ్స్ అడిగితే లేవని చెప్తున్నారట హోటల్ స్టాఫ్. ఫంక్షన్లకు, మీటింగులకు హాల్స్ అడిగినా ఖాళీలేవని రిప్లై ఇస్తున్నారట. మరాఠీలకు ఇక్కడేం పని అనుకుంటున్నారా..? వీళ్లంతా సీఎం కేసీఆర్ ను కలిసేందుకు వస్తున్నారట. పెద్దసారును కలిసేందుకు వస్తుండటంతో పార్టీ పెద్దలు ముందుగానే రూమ్స్ బుక్స్ చేస్తున్నారట. అందుకే హరిత ప్లాజా ఎప్పుడు చూసినా బిజీగానే ఉంటుందట.

బీఆర్ఎస్ లో చేరే మహారాష్ట్ర లీడర్లైనా, కార్తకర్తలైనా వాళ్ల కేరాఫ్ హరిత ప్లాజేనట. అక్కడ స్టే చేయడం..ప్రగతి భవన్ లో కండువా కప్పుకోవడం..తర్వాత వేకెట్ చేయడం. తర్వాత మరో టీమ్.. ఇలా మహారాష్ట్ర లీడర్లతో ఫుల్ బిజీగా ఉందట హరితప్లాజా. వాళ్ల కోసం ప్రత్యేకంగా BRS నుంచి ఒక టీం ఉందట. ఎంత మంది వస్తున్నారో తెలుసుకొని.. అడ్వాన్స్ గా రూమ్స్ బుక్ చేయడమే వీళ్ల పని. చిన్నా పెద్దా తేడా లేదట..అందరికీ రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్పాల్సిందేనట.

హరిత ప్లాజాలో రూమ్స్, హాల్స్ దొరక్కపోవడంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారట. వాస్తవంగా హరిత ప్లాజా టూరిజం డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో నడుస్తుంది. ప్రభుత్వ మీటింగ్ లు, ప్రైవేటు  ఫంక్షన్లకు మంచిగుంటది. బీఆర్ఎస్ మహారాష్ట్రపై ఫోకస్ పెట్టినప్పటి నుంచి మరాఠా లీడర్లతో హరిత ఫ్లాజా ఫుల్ అవుతోందట. వీళ్ల కోసం ప్రత్యేకంగా ఒక హోటల్ నే అప్పజెప్పటం ఏంటన్న విమర్శలొస్తున్నాయట.