అసోంను ముంచెత్తిన వరదలు

అసోంను ముంచెత్తిన వరదలు

ఆకస్మిక వర్షాలు అసోంను అతలాకుతలం చేశాయి. భారీ వరదలు ముంచెత్తుతుండటంతో జనజీవనం అస్తవ్యస్థమైంది. వరదల కారణంగా ఇప్పటి వరకు 14 మంది చనిపోగా.. 25వేల మందికిపైగా నిరాశ్రయులయ్యారు. రాష్ట్రంలోని 592 గ్రామాలపై వరద తీవ్ర ప్రభావం చూపింది. వరదల కారణంగా దాదాపు 900 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మరో 6వేలకు పైగా నివాసాలు పాక్షికంగా దెబ్బతిన్నాయని అసోం డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రకటించింది. 

అకాల వర్షాలు, వరదల కారణంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి.  దీంతో కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రోడ్లు పూర్తిగా ధ్వంసం కావడంతో చాలా ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. వరదల కారణంగా నిరాశ్రయులైన వారికి స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. 

మరిన్ని వార్తల కోసం..

నేటితో ముగియనున్న డ్రగ్స్ కేసు నిందితుల కస్టడీ

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు