Mexico : సూపర్ మార్కెట్లో భారీ పేలుడు.. 23 మంది మృతి

Mexico : సూపర్ మార్కెట్లో భారీ పేలుడు.. 23 మంది మృతి

మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది.  సూపర్ మార్కెట్ లో  భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 23 మంది  మరణించగా..మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 

 నవంబర్ 1న  (శనివారం) సోనోరా రాష్ట్రంలోని హెర్మోసిల్లో మధ్యలో ఉన్న వాల్డో దుకాణంలో  పేలుడు జరిగింది. దీంతో  భవనంలో  ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి, దట్టమైన పొగలు వ్యాపించాయి. మార్కెట్ ముందు   కారు తగలబడింది. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

 మృతుల్లో  8 మంది మైనర్లు, ఇద్దరు గర్భిణులు,వృద్దులు  ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై  ఆ రాష్ట్ర గవర్నర్ అల్ఫోన్సో డురాజో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంఘీభావం తెలిపారు.  ఈ ఘటనపై   దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు.