
ఆట సందీప్(Ata Sandeep) గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. డాన్స్ షోల ద్వారా ఆయన చాలా మందికి సుపరిచితమే. ప్రముఖ ఛానెల్ లో జరిగిన డాన్స్ షోలో టైటిల్ విన్నర్ గా నిలిచారు సందీప్. ఆ తరువాత పలు సినిమాలకు కొరియోగ్రఫర్ గా కూడా చేశారు. ఈ ఫేమ్ తోనే లేటేస్ట్ బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చాడు. కానీ అనూహ్యంగా మధ్యలోనే బయటకు వచ్చేశాడు. దేంతో ఆయన ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అయ్యారు.
ఇదిలా ఉంటే.. సందీప్ భార్య జ్యోతిరాజ్ తన గొప్ప మనసును చాటుకున్నారు. చలికాలంలో రోడ్డు పక్కన పడుకునేవాళ్ళు పడుతున్న ఇబ్బందిని తెలుసుకున్న ఆమె వారికీ దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. ఈరోజు నేను మా ఫ్రెండ్స్ కలిసి ఒక మంచి పనిచేశాము. ప్రస్తుతం చలి తీవ్రత చాలా పెరిగిపోయింది. దాంతో రోడ్డు పక్కన పడుకునే వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అది చూసి చాలా బాధేసింది. అందుకే మా ఏరియాలో ఉన్న వారికి దుప్పట్లు పంచాము. ఇక ఈ వీడియో ఎందుకు చేస్తున్నాం అంటే.. ఈ వీడియో చూసిన వారు కూడా మాలాగే వాళ్ళ ఏరియాలో ఉన్నవారికి సహాయం చేస్తారని భావిస్తున్నాం.. అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చారు జ్యోతిరాజ్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.