మంచిర్యాల, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఏటీసీల ద్వారా యువతకు సాంకేతిక శిక్షణ అందిస్తూ ఉద్యోగావకాశాలు కల్పిస్తోందని వరంగల్రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ఎస్.రాజా అన్నారు. ఇంజినీరింగ్ పట్టభద్రుల కంటే ఐటీఐ-ఏటీసీ విద్యార్థులకు అనేక బహుళజాతి సంస్థల్లో వేగంగా ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. ఇటీవల ఉట్నూర్ఏటీసీకి చెందిన 99 మంది విద్యార్థులు ప్రముఖ ఎంఎన్సీల్లో ఉద్యోగాలు పొందారని చెప్పారు.
ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రవేశపెట్టిన ‘మల్టీ స్కిల్ లెర్నింగ్’ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు మంగళవారం మంచిర్యాల ఐటీఐ-ఏటీసీలో నిర్వహించిన సర్టిఫికెట్ల ప్రదానోత్సవానికి ఆయన చీఫ్ గెస్ట్‌గా హాజరై మాట్లాడారు. రెండు వారాల వ్యవధిలో 850 మంది విద్యార్థులకు ఆరు బేసిక్ అడ్వాన్స్డ్ స్కిల్ కోర్సులను అందించామన్నారు. కార్యక్రమంలో ఐటీఐ- ఏటీసీ జిల్లా కన్వీనర్ పి.వెంకటేశ్వర్రావు, ఐటీఐల ప్రిన్సిపాళ్లు దేవానంద్, టి.సుజాత, పి.శ్రీనివాస్, రొడ్డ శ్రీనివాస్, పి.శేఖర్, వై.రమేశ్ పాల్గొన్నారు.
