క్లూస్‌‌ లేని కేసును ఛేదించే అథర్వ

 క్లూస్‌‌ లేని కేసును ఛేదించే అథర్వ

కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా లీడ్‌‌ రోల్స్‌‌లో తెరకెక్కిన చిత్రం ‘అథర్వ’. మహేష్ రెడ్డి దర్శకుడు. సుభాష్ నూతలపాటి నిర్మించారు. శుక్రవారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా కార్తీక్ రాజు మాట్లాడుతూ ‘క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ అనేవి దాదాపుగా ఒకే ఫార్మట్‌‌లో ఉంటాయి. కానీ ఇందులో ఎలాంటి క్లూస్ లేని ఓ కేసుని ఎలా పరిష్కరించారు అనేది ఆసక్తికరంగా ఉంటుంది. అదే ఈ సినిమాలో కొత్త పాయింట్. ఇందులో నా పాత్ర చాలెంజింగ్‌‌గా అనిపించింది. పోలీస్ అవ్వాలనుకుని  ఆస్తమా ఉండడంతో కాలేకపోతాడు.

దాంతో క్లూస్ టీమ్‌‌లో జాయిన్ అవుతాడు. క్రైమ్‌‌ జర్నలిస్ట్‌‌గా సిమ్రాన్ చౌదరి, హీరోయిన్‌‌గా ఐరా ఇంపార్టెంట్‌‌ రోల్స్ చేశారు. క్లూస్‌‌ టీమ్ ఆఫీసర్స్ చూసి మెచ్చుకున్న ఈ చిత్రం ప్రేక్షకులకు కూడా కచ్చితంగా నచ్చుతుందనే నమ్మకముంది. ఇక పీపుల్స్ మీడియా సంస్థలో ఇప్పటికే ఓ సినిమా పూర్తి చేశా. డిసెంబర్ 7 నుంచి నా కొత్త సినిమా మొదలవబోతోంది. అలాగే ఫుల్‌‌ లెంగ్త్‌‌ ఎంటర్‌‌‌‌టైన్మెంట్‌‌ జానర్‌‌‌‌లో ఈవీవీ సత్యనారాయణ గారి స్టైల్‌‌లో ఓ సినిమా చేయాలనుంది’ అని చెప్పాడు.