హైదరాబాద్‌సిటీ, వెలుగు: హైదరాబాద్‌కు తాగునీటిని సరఫరా చేసే సింగూరు ప్రాజెక్టులో పెద్దపూర్ నుంచి సింగూరు వరకు ఉన్న 1600 ఎంఎం డయా ఫేజ్-3 మెయిన్ పైప్‌లైన్‌లో భారీ లీకేజీలు ఏర్పడ్డాయి. వీటిని అరికట్టడానికి మెట్రో వాటర్ బోర్డు అధికారులు అత్యవసర రిపేర్లు చేపట్టారు. అలాగే టీజీ ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో 132 కేవీ కంది సబ్‌స్టేషన్ వద్ద పెద్దపూర్ ఫీడర్‌కు సంబంధించి ఎంఆర్టీ టెస్టింగ్, హాట్ లైన్ రిమార్క్స్, సాధారణ నిర్వహణ పనులు చేపట్టనున్నారు. ఈ పనులు ఈ నెల 3 (శనివారం) ఉదయం 10 గంటల నుంచి 4న (ఆదివారం) ఉదయం 4 గంటల వరకు జరుగుతాయి. ఈ కారణంగా 18 గంటలు సరఫరా ఉండదని అధికారులు ప్రకటించారు.
నీళ్లు రాని ప్రాంతాలు: మలేషియన్ టౌన్షిప్, మాదాపూర్, కొండాపూర్, డోయెన్స్ సెక్షన్, మాదాపూర్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ), భరత్ నగర్, మూసాపేట సెక్షన్, గాయత్రీ నగర్ సెక్షన్, బాలానగర్ సెక్షన్, కేపీహెచ్‌బీ కొంత భాగం, బాలాజీ నగర్ సెక్షన్ కొంత భాగం, ఫతేనగర్, గోపాల్ నగర్, హఫీజ్ పేట్ సెక్షన్, మయూరి నగర్, మియాపూర్ సెక్షన్, ప్రగతినగర్ సెక్షన్, మైటాస్, బీహెచ్‌ఈఎల్, ఎంఐజీ 1 అండ్ 2, రైల్ విహార్, సెంట్రల్ యూనివర్సిటీ, చందానగర్ తదితర ప్రాంతాలు.
