
అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘అథర్వ’ చిత్రాన్ని తెరకెక్కించాం అని చెబుతున్నారు నిర్మాత సుభాష్ నూతలపాటి. ఆయన నిర్మాతగా కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా లీడ్ రోల్స్‌లో మహేష్ రెడ్డి రూపొందించిన ఈ చిత్రం డిసెంబర్ 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత సుభాష్ మాట్లాడుతూ ‘సినిమా మొత్తం క్లూస్ డిపార్ట్‌మెంట్ గురించే ఉంటుంది. వారు చేసే పనిని , వారి కష్టాలను ఇందులో డీటైల్డ్‌గా చూపించాం. దీనికోసం డైరెక్టర్ ఆరు నెలలు రీసెర్చ్ చేశారు. కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలు పోషించారు. అన్ని రకాల జానర్లు ఇందులో ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కో పాయింట్ నచ్చుతుంది. ముఖ్యంగా ప్రతి పది నిమిషాలకు వచ్చే ట్విస్టులు అందరినీ ఆకట్టుకుంటాయి’ అని చెప్పారు.