కొత్త ఫీచర్లతో ఏథర్ 450ఎస్

కొత్త  ఫీచర్లతో ఏథర్ 450ఎస్

ఏథర్‌‌‌‌​ తన 450ఎస్ ​ఎలక్ట్రిక్​ స్కూటర్​ను  మెరుగైన ఫీచర్లు, పెద్ద బ్యాటరీతో అప్‌‌‌‌డేట్ చేసింది. ఈ కొత్త వేరియంట్‌‌‌‌లో 3.7 కిలోవాట్ ​అవర్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది మునుపటి 2.9 కిలోవాట్ ​అవర్ బ్యాటరీ కంటే పెద్దది. దీంతో మైలేజ్​ 115 కిలోమీటర్ల నుంచి 161 కిలోమీటర్లకు పెరిగింది.

 ఇది టాప్- మోడల్​ 450ఎక్స్​ మోడల్‌‌‌‌కు సమానమైన రేంజ్. ఈ కొత్త వేరియంట్‌‌‌‌ను రూ. 1.45 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో ఏథర్ ప్రవేశపెట్టింది.  5.4 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్, 22 ఎన్​ఎం టార్క్, గరిష్ట వేగం 90 కిలోమీటర్లు,  ఏడు -అంగుళాల డిస్​ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, ఆటోహోల్డ్, ఫాల్ సేఫ్,  అలెక్సా ఇంటిగ్రేషన్ వంటి ఫీచర్లు దీని సొంతం. హోమ్ చార్జర్‌‌‌‌తో 0-80శాతం చార్జ్ కావడానికి సుమారు 4.5 గంటలు పడుతుంది.