స్టీమ్ ఎంగేజ్..ముగింపు ఇంత ఉందా?

స్టీమ్ ఎంగేజ్..ముగింపు ఇంత ఉందా?

ముగింపు ఇంత ఉందా?

టైటిల్ : అతిథి

కాస్ట్ : తొట్టెంపూడి వేణు, అవంతిక మిశ్ర, అదితి గౌతమ్, వెంకటేష్ కాకుమాను, రవి వర్మ, భద్రమ్
డైరెక్టర్ : భరత్ వైజ, 
లాంగ్వేజ్ : తెలుగు, ప్లాట్ ఫాం : హాట్ స్టార్
ఎపిసోడ్స్ : 6 ( ఒక్కో ఎపిసోడ్ దాదాపు 30 నిమిషాలు)

ఒక పెద్ద ఇంట్లో భార్యాభర్తలు రవి(వేణు), సంధ్య (అదితి గౌతమ్) ఉంటుంటారు. భార్య కాళ్లు చచ్చుబడిపోవడంతో ఆమెను కంటికి రెప్పలా చూసుకుంటుంటాడు రవి. ఒకరోజు రాత్రి వర్షం కురుస్తుంటుంది. ఆ రాత్రి మాయ(అవంతిక) ఆ ఇంటికి వెళ్తుంది. రవి వాళ్ల ఇంటికి దగ్గరలో దెయ్యాల మిట్టలో ఆడ దెయ్యం తిరుగుతుందని ప్రచారం ఉంటుంది. అక్కడ దెయ్యాలు లేవని చెప్పే వీడియోలు చేసే యూట్యూబర్ సవేరి(వెంకటేష్ కాకుమాను) అక్కడికి వెళ్తాడు. కానీ అక్కడ సవేరికి దెయ్యం కనిపిస్తుంది. దాంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆ పక్కనే ఉన్న రవి ఇంటికి వెళ్తాడు. వాళ్ల వెనకే ప్రకాష్ (రవివర్మ)  వెళ్తాడు. మాయ తనను వెంటాడుతూ వచ్చిన దెయ్యమే అని భయపడతాడు సవేరి. ఇంతకీ మాయ నిజంగానే దెయ్యమా? లేదంటే అసలు దెయ్యం వేరే ఉందా? అసలు అక్కడ దెయ్యాలు నిజంగా ఉన్నాయా? లేదా? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ సిరీస్ చూడాలి.


విషయం పాతదే కానీ...

టైటిల్ : బంబయ్ మేరీ జాన్
కాస్ట్ : కే కే మీనన్, అవినాష్ తివారి, కృతిక కమ్రా, వివాన్ భటేనా
డైరెక్టర్ : షుజాత్ సౌదాగర్
లాంగ్వేజ్ :  హిందీ
ప్లాట్ ఫాం : అమెజాన్ ప్రైమ్
ఎపిసోడ్స్ : 10 (ఒక్కో ఎపిసోడ్ 36 నుంచి 56 నిమిషాల మధ్య ఉంటుంది)

మాలిక్ అనే పోలీస్ ఆఫీసర్ తనని అరెస్ట్ చేయడానికి వస్తున్నాడు అని దారా కద్రి(దావూద్ ఇబ్రహీం) (అవినాష్ తివారీ)కి తెలుస్తుంది. పోలీసులకు చిక్కకుండా ఉండాలంటే ఒక గంటలో అక్కడినుంచి పారిపోవాలి. అతను అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంటాడు. కానీ దారా తండ్రి ఇస్మాయిల్ కద్రి మాత్రం ఇండియా వదిలిపెట్టి వెళ్లేందుకు ఇష్టపడడు. బలవంతంగా తనని అక్కడి నుంచి తీసుకెళ్లాలని ట్రై చేస్తే తుపాకీతో కాల్చుకుంటానని బెదిరిస్తాడు. ఈ సీన్ సిరీస్ టెంపో పెంచడంతో పాటు తండ్రీ కొడుకుల మధ్య ఉన్న సైద్ధాంతిక విభేదాలు బయటపడతాయి. షుజాత్ సౌదాగర్ డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ 1945 నుంచి 1986 మధ్య కాలాలకు చెందిన విషయాలు చెప్తూ ముందుకు వెనుకకు రకరకాల టైం లైన్లలో నడుస్తుంటుంది. మొదటి మూడు ఎపిసోడ్లు ఇస్మాయిల్ కద్రి గురించి ఉంటాయి. నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ గా అయిన అతను తరువాత హజికి ఎందుకు పనిచేయాల్సి వచ్చిందనేది ఉంటుంది. ఆ తరువాత హజి, అతని ఇద్దరు పార్ట్ నర్స్ ను పక్కన పెట్టి దారా సీన్​లోకి వస్తాడు. ఆఖరి ఎపిసోడ్స్  లో చోటా బబ్బన్ (చోటా రాజన్)ను కూడా ఇంట్రడ్యూస్ చేశారు. బొంబాయి మేరీ జాన్ లో ఓల్డ్ బొంబాయి గ్రాండ్ నెస్  చూపించారు. కొన్ని 
లొకేషన్స్ డిటెయిలింగ్, క్యారెక్టర్లు చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి కూడా. అవి చూస్తూ ఆడియెన్స్1980ల్లోకి వెళ్లిపోతారు. దావూద్ స్టోరీని చెప్పడం అనే విషయాన్ని పక్కన పెడితే కేకే మీనన్ నటన ఈ వెబ్ సిరీస్ కు హైలైట్. దారా ఇస్మాయిల్ కద్రిగా అవినాష్ తివారీ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇండియాలో మోస్ట్ వాంటెడ్ మనిషి గురించి డిఫరెంట్ ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ తో తీశారు. ఈ సిరీస్  మొత్తం ఏకబిగిన చూడాలంటే మాత్రం ఆరు నుంచి ఏడు గంటల టైం కావాలి.


సహజత్వం తెచ్చిన సక్సెస్

టైటిల్ : జర్నీ  ఆఫ్ లవ్ 18 ప్లస్
కాస్ట్ : నస్లీన్ కే. గఫూర్, మాథ్యూ థామస్ , మీనాక్షి దినేష్, నిఖిల విమల్ బిను పప్పు, రాజేష్ మాధవన్ 
డైరెక్టర్ : అరుణ్ డి. జోస్ 
లాంగ్వేజ్ : మలయాళం
ప్లాట్ ఫాం : సోనీ లివ్

ఆ ఊరి పెద్ద రవీంద్రన్(మనోజ్). అతను కొడుకు అర్జున్ (సత్యం మోహన్), కూతురు అధిర (మీనాక్షి దినేశ్)  భార్యతో కలిసి ఉంటుంటాడు. ఊరికి పెద్దగా వ్యవహరించడమే కాకుండా రాజకీయాల్లో కూడా చక్రం తిప్పుతుంటాడు రవీంద్రన్. రవీంద్రన్ కూతురు, అఖిల్ (నస్లీన్) ప్రేమించుకుంటారు. అయితే కులమతాలు, ఆర్థిక స్థోమతల మధ్య ఉన్న అంతరాల వల్ల అఖిల్ ను ప్రేమించిన విషయం రహస్యంగా ఉంచుతుంది అథిర. కూతురు ప్రేమిస్తున్న విషయం అర్జున్ వల్ల రవీంద్రన్ కు తెలుస్తుంది. దాంతో కూతుర్ని అహ్మదాబాద్లో ఉంటున్న ఆమె మేనత్త దగ్గరికి పంపించాలి అనుకుంటాడు. ఆ విషయం తెలుసుకున్న అథిర సీక్రెట్ గా అఖిల్ కి ఫోన్ చేసి... ఇద్దరం ఊరు వదిలి వెళ్లిపోయి పెళ్లి చేసుకుందాం అంటుంది. అందుకు ఊరి జనాలను ఎదిరించి పెళ్లి చేసుకున్న రాజేష్(బినూ పప్పు) సాయం తీసుకుంటారు. ఊరు దాటి వెళ్లిపోయి గుళ్లో పెళ్లి చేసుకుంటారు. ఆ తరువాత అథిర నాయనమ్మ చనిపోయిన విషయం తెలుస్తుంది. దాంతో ఆ ఊరికి వెళ్తారు. అక్కడికి వెళ్లిన తరువాత అథిర మైనర్ అనే విషయం బయట పడుతుంది. ఈ విషయం తెలిశాక ఏం జరిగింది? తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా జులైలో థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు ఓటీటీకి వచ్చింది. ఎన్నో సినిమాలు ఇలాంటి కథా నేపథ్యంలో వచ్చాయి కూడా. కాకపోతే ఈ సినిమా బలమంతా సహజత్వంలోనే ఉంది. అదే సినిమాని ఆసక్తికరంగా మలచింది.