తీరంలో నెత్తుటి అలలు

తీరంలో నెత్తుటి అలలు

సముద్ర తీరం ఎరుపు రంగు పులుముకుంది. నెత్తుటి అలలతో పోటెత్తింది. తిమింగలాలు, డాల్ఫిన్ల కళేబరాలతో శ్మశానంలా మారిపోయింది. అట్లాంటిక్​ దీవుల్లో ఉన్న ఫరో ఐలాండ్​లోని  స్ట్రీమాయ్​ దీవుల రాజధాని తోర్షవ్న్​ సిటీ జనం వాటిని వేటాడారు. ప్రతి వేసవిలో తిమింగలాలు, డాల్ఫిన్లు అక్కడికి వలస వస్తుంటాయి. దీంతో జనం వాటిని వేటాడుతుంటారు. అందులో భాగంగానే 200 దాకా తిమింగలాలు, 50 దాకా డాల్ఫిన్లను సముద్రం లోపలి నుంచి తీరానికి తరిమారు. అలా వచ్చిన ఆ జీవుల తలలను తెగనరికారు. వాటి వేటకు ఫరో ఐలాండ్​ చట్టం కూడా చేసింది. `వాడే ఆయుధాలు, చంపే పద్ధతిని చెప్పింది.

ఫరో దీవుల మాంసం అవసరాలను తీర్చేందుకు ఏటా 800 దాకా తిమింగలాలు, డాల్ఫిన్లను వేటాడుతుంటారు. తాజా వేటపై బ్లూ ప్లానెట్​ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు మండిపడ్డారు. ఈ ఏడాది వేసవి ప్రారంభం నుంచి 500 దాకా తిమింగలాలు, డాల్ఫిన్లను చంపారని యూరోపియన్​ యూనియన్​కు సంస్థ ఫిర్యాదు చేసింది. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరింది.
కాగా, 16వ శతాబ్దం నుంచే అక్కడ వీటిని
వేటాడుతున్నారు.