సినిమా స్టైల్లో ఏటీఎం దొంగతనం.. ఒకరు అరెస్ట్, మరొకరు పరారీ

సినిమా స్టైల్లో ఏటీఎం దొంగతనం.. ఒకరు అరెస్ట్, మరొకరు పరారీ

మియాపూర్, వెలుగు: ‘కనులు కనులను దోచాయంటే’ సినిమాలో హీరో ఏటీఎం మిషన్​లో చిప్ పెట్టి డబ్బులు కొట్టేసినట్టే ప్రయత్నించి ఓ దొంగ పోలీసులకు చిక్కాడు. ఏపీలోని అనంతపురానికి చెందిన వడ్డె కాటమయ్య (24) డిగ్రీ మధ్యలో ఆపేశాడు. సులభంగా డబ్బు సంపాదించేందుకు ఆన్​లైన్​లో ఏటీఎం దొంగతనం వీడియోలు చూసి అదే విధంగా ప్రయత్నించాడు. సెక్యూరిటీ తక్కువగా ఉన్న హఫీజ్​పేట్ మార్తండనగర్​లోని ఎస్బీఐ ఏటీఎంలో ఆదివారం రాత్రి మరో వ్యక్తి రామాంజనేయులుతో కలిసి ప్రత్యేక డివైజ్ ద్వారా డబ్బులు డ్రా చేసేందుకు ప్రయత్నించారు.

ఏటీఎం వద్ద అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానిక యువకుడు బాలునాయక్ డయల్ 100కు సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కాటమయ్యను అరెస్ట్ చేశారు. పోలీసుల రాకను చూసిన రామాంజనేయులు అక్కడి నుంచి పరారయ్యాడు.