ఈవీ ఇండియా 2022 షో లో స్పెషల్ అట్రాక్షన్​గా ‘ఆటమ్ బైక్స్’

ఈవీ ఇండియా 2022 షో లో స్పెషల్ అట్రాక్షన్​గా ‘ఆటమ్ బైక్స్’

న్యూఢిల్లీ, వెలుగు: ఎలక్ట్రికల్ వెహికల్స్ (ఈవీ) రంగంలో విశాఖ గ్రూప్ కు చెందిన ‘ఆటమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మొబైల్’  కంపెనీ బైక్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పో సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ నెల 7 నుంచి 9 వరకు ఈవీ ఇండియా 2022 (ఇండియా బిగ్గెస్ట్ మోటర్ వెహికల్ షో) జరుగుతోంది. దేశ వ్యాప్తంగా దాదాపు వందకు పైగా సంస్థలు ఈవీ రంగంలో తాము రూపొందించిన బైక్స్, బ్యాటరీ, ఎలక్ట్రికల్ వెహికల్స్ పార్ట్స్, ఆటో మొబైల్స్ ను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ఇందులో విశాఖ గ్రూప్ కు చెందిన ఆటమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మొబైల్స్ కంపెనీ తయారు చేసిన ‘ఆటమ్’ బైక్స్ అందర్ని ఆకట్టుకుంటున్నాయి. ఈ కంపెనీ ఆటమ్ వేడర్, ఆటమ్ 1. ఓ బైక్స్ ను ప్రదర్శనకు ఉంచింది. తక్కువ ధర, బెస్ట్ వెహికల్స్ కావడంతో పెద్ద ఎత్తున ఈ వెహికల్స్ డీలర్ షిప్, వెహికల్స్ కొనుగోలు చేసేందుకు విజిటర్స్ ఆసక్తి చూపుతున్నట్లు ఆటమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మొబైల్ కంపెనీ సేల్స్ మేనేజర్ ఆదిత్య తెలిపారు. గంటకు 25 కి. మీ వేగంతో ప్రయాణించే ఆటమ్ 1.ఓ కు వెహికల్ రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్‌ అవసరం లేదన్నారు. అలాగే, గంటకు 65 కి.మీ వేగంతో దూసుకుపోయేలా ఆటమ్ వేడర్ ను రూపొందించినట్లు చెప్పారు. అందువల్ల ఈవీ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పో లో పెద్ద ఎత్తున విజిటర్స్ తమ బైక్స్ పై మక్కువ చూపుతున్నారని చెప్పారు. కాగా, ఆటమ్ వేడర్ ధర రూ. 1 లక్ష, ఆటమ్ 1.ఓ ధర రూ. 70 వేలకు మార్కెట్ లో అందుబాటులో ఉందన్నారు. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, యూపీ, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ, బిహార్, మరికొన్ని రాష్ట్రాల్లో తమకు డీలర్స్ ఉన్నాయని చెప్పారు.

నేడు వరల్డ్ ఈవీ డే..
పర్యావరణ కాలుష్యం పట్ల అందరిలో అవగాహన పెరగడంతో జీవితంలో వీలైనంత ఎక్కువగా ఎకో–ఫ్రెండ్లీగా ఉండాలని ప్రజలు భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్‌‌‌‌ వెహికల్స్‌‌పై ప్రపంచవ్యాప్తంగా ఫోకస్‌‌ పెరగడం గమనించొచ్చు. నేడు వరల్డ్ ఈవీ డే సందర్భంగా దేశ  ప్రభుత్వం ఈవీలకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని మరోసారి గుర్తు చేసుకుందాం. ఈవీల పెరుగుదలకు సమాంతరంగా దేశంలో ఛార్జింగ్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ మెరుగుపరిచేందుకు  ప్రభుత్వం వివిధ స్కీమ్‌లు తీసుకొచ్చింది. ఇండియాలో సుమారు 10 లక్షల ఈవీలు ​ రోడ్లపై తిరుగుతున్నట్లు అంచనా. ఈవీ ఛార్జింగ్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు చొరవ తీసుకుంటున్నాయి. మరోవైపు ఇండ్లలోనూ, ఆఫీసులలోనూ కూడా జోరుగానే  ఈవీ ఛార్జింగ్​ యూనిట్లు ఏర్పాటవుతున్నాయి.  

మా ఎలక్ట్రిక్​ వెహికల్స్​ పూర్తిగా మన దేశంలోనే తయారయ్యాయి. గ్రీన్​ బైకింగ్​ను అందరికీ అందుబాటులోకి తేవాలనేదే మా లక్ష్యం. మా బైకులు ఒక్కటే కాదు, మాన్యుఫాక్చరింగ్​ ఎకో సిస్టమ్​ మొత్తం ఎకో ఫ్రెండ్లీగానే ఏర్పాటు చేశాం. హైదరాబాద్​ సమీపంలోని పటాన్​చెరు వద్ద మా ప్లాంట్​ ఉంది. ఇక్కడ ఆటమ్​ సోలార్​ రూఫ్​ ఏర్పాటు చేశాం. మా ఈవీ ఛార్జింగ్​ స్టేషన్​లకు కూడా ఆటమ్​ సోలార్​రూఫ్​అమర్చుతున్నాం. పర్యావరణాన్ని కాపాడేందుకు మా వంతు కృషి కొనసాగిస్తామని  వరల్డ్​ ఈవీ డే సందర్భంగా హామీ ఇస్తున్నాం.

‑ వంశీ గడ్డం, ఫౌండర్‑ఆటమ్​ మొబైల్​,జేఎండీ‑విశాకా ఇండస్ట్రీస్​