నర్సారెడ్డిపై అట్రాసిటీ కేసు అన్యాయం : విజయ మోహన్

నర్సారెడ్డిపై అట్రాసిటీ కేసు అన్యాయం :  విజయ మోహన్
  • వంటి మామిడి ఏఎంసీ చైర్ పర్సన్​ విజయ మోహన్​ 

గజ్వేల్, వెలుగు: మాజీ ఎమ్మెల్యే, డీసీసీ ప్రెసిడెంట్​ తూంకుంట నర్సారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం అన్యాయమని వంటిమామిడి మార్కెట్​కమిటీ చైర్​పర్సన్​బాగనోల్ల విజయమోహన్, దళిత సంఘాల నేతలు వెంకటస్వామి, కొడకండ్ల నర్సింలు, వీరేశం, అనిల్, అండాలమ్మ, శివులు అన్నారు. నర్సారెడ్డిపై అట్రాసిటీ కేసు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం దలిత సంఘాలు, కాంగ్రెస్​ఎస్సీ నాయకులతో కలిసి గజ్వేల్​ పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గజ్వేల్ లో జరిగిన  రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో ఎలాంటి ప్రొటోకాల్ లేని కొండపాక విజయకుమార్ వేదికపైకి వెళ్లి గొడవ చేయగా అతడిపై  కేసు నమోదు చేయాల్సిందన్నారు. కానీ పోలీసులు అందుకు భిన్నంగా నర్సారెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేయడం సిగ్గుచేటన్నారు. గజ్వేల్ లో గ్రూపులను ప్రోత్సహిస్తున్న మైనంపల్లి హన్మంతరావు ఒత్తిడితో పోలీసులు ఈ కేసు నమోదు చేశారన్నారు. 

హరీశ్ రావు లాంటి దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ దళితులను ప్రోత్సహిస్తున్న నర్సారెడ్డిపై అక్రమంగా అట్రాసిటీ కేసు నమోదు చేయించడం సిగ్గుచేటన్నారు. వెంటనే అతడిపై నమోదైన అట్రాసిటీ కేసును ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ యాదగిరి, మహేందర్, శ్రీనివాస్, నాచగిరి టెంపుల్ డైరెక్టర్ పద్మవెంకటేశ్, నాయకులు మల్లికార్జున్, రత్నాకర్, బాబు, గణేశ్, సురేశ్, బాలు, యాదగిరి, అరుణ్ పాల్గొన్నారు.