
తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో దారుణం జరిగింది. లితారాంబట్టిలోని ప్రముఖ బిర్యానీ షాప్ లో పనిచేస్తున్న యువకుడిని దుండగులు కత్తులు, ఐరన్ రాడ్ లతో దాడిచేసి హత్యచేశారు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు మృతుడు జెట్యాల్లికి చెందిన ఆసిఫ్ గా గుర్తించారు. అటు హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు... శివాడికి చెందిన నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ధర్మపురి జిల్లా ఎస్పీ తెలిపారు.