కేసు పెట్టడానికొచ్చి కొట్లాట.. తెగిపడిన కానిస్టేబుల్ చేతి వేలు

V6 Velugu Posted on Oct 22, 2019

ఖమ్మం: కేసు పెట్టడానికి పోలీసు స్టేషన్ కు వెళ్లినోళ్లు అక్కడే కొట్లాటకు దిగారు. ఏకంగా డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడి చేశారు. విచక్షణా రహితంగా పిడిగుద్దులు, నోటితో కొరకడం లాంటి పిచ్చి పనులు చేశారు. ఈ గలాటాలో ఓ కానిస్టేబుల్ చేతి వేలు తెగి కిందపడింది. ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది.

తొడ.. చేతి వేళ్లపై కొరికి..

అర్ధ రాత్రి కొంత మంది కంప్లైంట్ ఇవ్వాలంటూ స్టేషన్ కు వచ్చారు. ఆ సమయంలో కానిస్టేబుల్ మసూద్ అలీ డ్యూటీలో ఉన్నారు. కేసు పెట్టాలంటూ మొదలు పెట్టిన వాళ్లు కొద్దిసేపటికి అలీపై దాడికి దిగారు. పైశాచికంగా తొడపై, చేతి వేళ్లపై కొరికారు. ఈ సమయంలో ఆయన చిటికిన వేలు తెగి కిందపడింది. స్టేషన్ లోని మిగతా సిబ్బంది ఆ గొడవ పడుతున్న వారిని అదుపు చేయడానికి తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. ఆ తర్వాత కానిస్టేబుల్ మసూద్ అలీని కిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. అయితే పోలీసులు ఈ విషయాన్ని బయటకు రాకుండా గోప్యంగా ఉంచుతున్నారు. స్టేషన్ లో గొడవ చేసిందెవరు? ఎందుకు జరిగింది? అన్న విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నించగా.. వారు స్పందించలేదు.

Tagged constable, Attack On Police, Man bites, finger cut, Khammam police station

Latest Videos

Subscribe Now

More News