నందిగ్రామ్ లో మమతా బెనర్జీపై దాడి.. గాయాలు

నందిగ్రామ్ లో మమతా బెనర్జీపై దాడి.. గాయాలు

కోల్ ‌కతా: పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీకి గాయాలయ్యాయి. కారులో నుంచి దిగే క్రమంలో డోర్ తీస్తుండగా కొంత మంది తనపై దాడికి దిగినట్లు తెలిపారు మమతా బెనర్జీ. ఆమె కాలుకు గాయాలయ్యాయని ఆమె భద్రతా సిబ్బంది తెలిపారు. బుధవారం నందిగ్రామ్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేసేందుకు వచ్చిన మమతా.. ఈరోజు ఇక్కడే ఉండి గురువారం ఉదయం కోల్‌కతాకు వెళ్లేందుకు మమతా బెనర్జీ ముందుగానే షెడ్యూల్ తయారు చేసుకున్నారు. అయితే అనుకోని ఈ సంఘటనతో బుధవారం నందిగ్రామ్ లోనే ఉంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది.