
మయన్మార్‌లో కొనసాగుతున్న అంతర్యుద్ధం క్రమంలో ఓ మఠంపై జరిగిన దాడిలో 23 మంది మృతిచెందారు. శుక్రవారం(జూలై 11) తెల్లవారుజామున మయన్మార్‌లోని సాగింగ్ ప్రాంతంలోని లింటాలూ గ్రామంలోని ఓ మఠంపై ఈ దాడి జరిగింది. ఈ దాడి వైమానిక దాడుల (airstrike) ద్వారా జరిగింది. మయన్మార్ పాలకుల సైనిక జుంటా స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కౌన్సిల్ వైమానికి దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే జుంటా నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
సాగింగ్ డిస్ట్రిక్ట్ పీపుల్స్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ హ్లయింగ్ బ్వా , స్థానిక నివాసితుల కథనం ప్రకారం..మయన్మార్ పాలకుల సైనిక జుంటా స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కౌన్సిల్ వైమానికి దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో 23 మంది మృతిచెందారు. ఇందులో నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. ఇంకా చాలా మంది గాయపడినట్లు స్థానిక నివాసితులు తెలిపారు.
గతం కొంతకాలంగా మయన్మార్ లో అంతర్యుద్ధం కొనసాగుతోంది. సైన్యం,ప్రజాస్వామ్య అనుకూల శక్తుల మధ్య తీవ్ర పోరాటం జరుగుతోంది. దీంతో నిరాశ్రయులైన సుమారు 200 మంది దాడి జరిగిన మఠంలో ఆశ్రయం పొందుతున్నారు. దాడిలో మరణించిన వారంతా నిరాశ్రయులైన పౌరులే.
2021లో నోబెల్ గ్రహీత ఆంగ్ సాన్ సూకీ నేతృత్వంలో ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసి సైన్యం అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటి నుంచి మయన్మార్ లో తీవ్ర అంతర్యుద్ధంలో కొనసాగుతోంది. సైనిక పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆ తర్వాత సాయుధ తిరుగుబాటు దేశాన్ని అల్లకల్లోలం చేశాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘర్షణలో పౌరులే ఎక్కువగా నష్టపోతున్నారు.
సాగింగ్ ప్రాంతంలో మార్చి 28న సంభవించిన 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ప్రభుత్వం మానవతా సహాయం అందించేందుకు ప్రాంతాన్ని పునర్నిర్మించడానికి తాత్కాలిక కాల్పుల విరమణను ప్రకటించింది సైన్యం. అయితే ఇప్పుడు భూకంపం దెబ్బతిన్న ప్రాంతాలతో సహా తిరుగుబాటుదారులు నియంత్రణలో ఉన్న ప్రాంతాలపై సైన్యం వైమానిక దాడులను, ఫిరంగి దాడులను కొనసాగిస్తోంది.
ALSO READ : ట్రంప్ చర్యలతో NASA ఖాళీ.. 2 వేల మంది సీనియర్ ఉద్యోగులు రాజీనామా..
మే నెలలో సమాంతర పౌర జాతీయ ఐక్యత ప్రభుత్వం(NUG) సాగింగ్‌లోని డెపాయిన్ పట్టణంలో ఒక పాఠశాలపై జరిగిన వైమానిక దాడిలో 17 మంది విద్యార్థులు చనిపోయారు. తాజాగా మఠంపై దాడి మయన్మార్‌లోని సాధారణ పౌరులు ఎదుర్కొంటున్న ప్రమాదకరమైన పరిస్థితులకు మరో ఉదాహరణ.