పిల్లల డాక్టర్ పై దాడి..నిర్మల్ పీఎస్ ఎదుట ఐఎంఏ ఆందోళన

పిల్లల డాక్టర్ పై దాడి..నిర్మల్ పీఎస్ ఎదుట  ఐఎంఏ ఆందోళన

నిర్మల్, వెలుగు: నిర్మల్ పట్టణానికి చెందిన ప్రముఖ పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ చిటికేశి సంతోష్ రాజ్‌‌పై గురువారం రాత్రి కొంతమంది వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. హాస్పిటల్ బిల్లు విషయంలో జరిగిన వివాదం కారణంగా నలుగురైదుగురు వ్యక్తులు కలిసి డాక్టర్‌‌తో పాటు ఆస్పత్రి సిబ్బందిపై దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఐఎంఏ ప్రతినిధులు, ప్రైవేట్ డాక్టర్లు, స్థానికులు రూరల్ పోలీస్ స్టేషన్ ముందు రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. సుమారు అరగంట పాటు ఆందోళన కొనసాగింది. డాక్టర్ సంతోష్ రాజ్‌‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన ఐఎంఏ నాయకులు, దాడికి పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.