తమిళనాడును విభజించే కుట్ర

తమిళనాడును విభజించే కుట్ర

చెన్నై: తమిళనాడును విభజించే కుట్ర జరుగుతోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కే.స్టాలిన్ ఆరోపించారు. కులమతాల ప్రాతిపదికన తమిళ ప్రజలను విడగొట్టేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని దుయ్యబట్టారు. తద్వారా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు దీన్ని అర్థం చేసుకుని, ఇలాంటి కుట్రలను తిప్పికొట్టాలన్నారు. రాష్ట్ర ప్రజలందరూ ఐకమత్యంగా ఉండాలన్నారు. చెన్నైలో ఓ ఇఫ్తార్‌ విందులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కుల, మతాల ప్రాతిపదికన విభజించడం ద్వారా తమిళ జాతికి ముగింపు పలకొచ్చని, మన అభివృద్ధిని అడ్డుకోవచ్చని కొంతమంది అనుకుంటున్నారని అన్నారు. ఆ ఉచ్చులో పడకూడదని, అటువంటి ప్రయత్నాల వెనుక దాగి ఉన్న కుట్రలను పసిగట్టాలని సూచించారు. 

వివాదాస్పద సిటిజన్ షిప్ అమెండ్ మెంట్ యాక్ట్ (సీఏఏ) బిల్లు విషయంలో విపక్ష అన్నాడీఎంకే వ్యవహరించిన తీరు మీద కూడా స్టాలిన్ ఫైర్ అయ్యారు. మన రాజ్యాంగంలోని లౌకిక విలువలకు సీఏఏ విరుద్ధమన్న ఆయన.. గతేడాది తమిళనాడు అసెంబ్లీలో తమ పార్టీ తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తాము సీఏఏను వ్యతిరేకించామని, ఆ బిల్లుకు వ్యతిరేకంగా క్యాంపెయినింగ్ కూడా చేశామన్నారు. కానీ అన్నాడీఎంకే సీఏఏకు అనుకూలంగా ఓటు వేసిందన్నారు. తమ స్వదేశాలను వదిలి ఇక్కడకు వచ్చిన శరణార్థులను ఆదుకోవాల్సింది పోయి.. మతం పేరుతో వారిపై వివక్ష చూపడం సరికాదన్నారు. 

మరిన్ని వార్తల కోసం:

‘ఆచార్య’ నుంచి కాజల్ కట్?

సమ్మర్​లో.. నల్ల కళ్లద్దాలు పెట్టాల్సిందే

నెయ్యి తప్పకుండా తినిపించాలి