ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

యాదాద్రి, వెలుగు : హాస్టళ్ల నిర్వహణ సరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని యాదాద్రి కలెక్టర్‌‌‌‌‌‌‌‌ పమేలా సత్పతి ఆదేశించారు. జిల్లాలోని 51 హాస్టళ్లు, 16 గురుకులాల నిర్వహణపై శుక్రవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హాస్టళ్లలో కిచెన్‌‌‌‌‌‌‌‌, టాయిలెట్లతో పాటు పరిసరాలు క్లీన్‌‌‌‌‌‌‌‌గా ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మెస్‌‌‌‌‌‌‌‌ కమిటీ సూచనల మేరకు ఆహారం అందించాలని, రెగ్యులర్‌‌‌‌‌‌‌‌గా పేరెంట్స్‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేయాలని చెప్పారు. స్టూడెంట్ల ఆరోగ్యం పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని సూచించారు. అనంతరం వలిగొండలో నిర్వహించిన మీటింగ్‌‌‌‌‌‌‌‌లో మాట్లాడారు. గర్భిణులు తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలని, నాల్గవ నెల నుంచి డెలివరీ వరకు రోజుకు ఒకటి చొప్పున ఐరన్‌‌‌‌‌‌‌‌ ట్యాబ్లెట్లు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ దీపక్‌‌‌‌‌‌‌‌ తివారి, ఏసీపీ వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డి, డీఆర్డీవో ఉపేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు యాదయ్య, జైపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి, సర్పంచ్‌‌‌‌‌‌‌‌ బొల్ల లల్లిత, ఎంపీటీసీ కుందారపు యశోధ పాల్గొన్నారు.

రాజ్యాంగానికి అనుగుణంగా పాలన సాగాలి

మిర్యాలగూడ, వెలుగు : విధానపరమైన విమర్శలతో ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యం అవుతుందని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న చెప్పారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా పాలన సాగాలని చెప్పారు. జాతీయోద్యమం నాటి పెట్టుబడిదారులకున్న దేశహితం నేటి పాలకులకు లేకపోవడం శోచనీయమన్నారు. నేటి రచనల్లో అసహజత్వం పెరిగిందని, మానవ విలువలను మార్కెట్‌‌‌‌‌‌‌‌ ధ్వంసం చేసిందన్నారు. అంతకుముందు హౌజింగ్‌‌‌‌‌‌‌‌ బోర్డు కాలనీలో క్యూర్‌‌‌‌‌‌‌‌ హోమియోపతి క్లినిక్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించారు. సమావేశంలో మున్సిపల్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ తిరునగరు భార్గవ్‌‌‌‌‌‌‌‌, అంబటి సురేందర్‌‌‌‌‌‌‌‌రాజు, ధర్మపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి, కేతనపల్లి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి, మారం శ్రీనివాస్, దాసి సుదర్శన్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు. 

ఫార్మా కంపెనీ పర్మిషన్‌‌‌‌‌‌‌‌ను రద్దు చేయాలి

చండూరు, వెలుగు : నల్గొండ జిల్లా గట్టుప్పల్‌‌‌‌‌‌‌‌, యాదాద్రి జిల్లా పుట్టపాక గ్రామాల మధ్య ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయొద్దంటూ శుక్రవారం అఖిలపక్ష నాయకులు, ప్రజలు కంపెనీ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చలమల కృష్ణారెడ్డి మాట్లాడుతూ కంపెనీ ఏర్పాటుతో కాలుష్యం పెరిగే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలుగజేసే కంపెనీ పర్మిషన్‌‌‌‌‌‌‌‌ను రద్దు చేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే అఖిలపక్షం ఆధ్వర్యంలో ప్రగతిభవన్‌‌‌‌‌‌‌‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం మాట్లాడుతూ ఇప్పటికే ఫ్లోరైడ్‌‌‌‌‌‌‌‌తో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇప్పుడు కంపెనీ ఏర్పాటు వల్ల భూమి, నీరు కలుషితం అయ్యే ప్రమాదం ఉందన్నారు. కంపెనీ పర్మిషన్‌‌‌‌‌‌‌‌ రద్దు చేసే వరకు పార్టీలకతీతంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సర్పంచ్ ఇడం రోజా, ఎంపీటీసీ గొరిగె సత్తయ్య, అఖిలపక్ష నాయకులు కర్నాటి మల్లేశం, ఇడం కైలాసం, భీమగాని మల్లేశం, భీమగాని మహేశ్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేయాలి

సూర్యాపేట, వెలుగు : పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేయాలని పీడీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూ జిల్లా అధ్యక్షుడు పోలెబోయిన కిరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం సూర్యాపేటలో మంత్రి ఇంటి ముందు ధర్నా నిర్వహించేందుకు స్టూడెంట్లతో వెళ్తున్న పీడీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూ లీడర్లను పోలీసులు అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించారు. ఈ సందర్భంగా కిరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్కాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలిపి రూ. 3,500 కోట్లు పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉండడంతో కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, దీంతో స్టూడెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ జూనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం అమలు చేస్తామని చెప్పి ఎనిమిదేళ్లు గడుస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. శిథిలావస్థలో ఉన్న స్కూళ్లు, హాస్టళ్లకు సొంత బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు నిర్మించాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. కార్యక్రమంలో పీడీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూ నాయకులు పిడమర్తి భరత్, కేశబోయిన వంశీ, మహిపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి

నార్కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు : గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని నకిరేకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, నల్గొండ జడ్పీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బండా నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. నల్గొండ జిల్లా నార్కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి మండలం షాపల్లిలో సీసీ రోడ్డు పనులను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నకిరేకల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికే దిక్సూచిగా మారిందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాయల చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేగట్టె మల్లికార్జున్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, సర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కర్నాటి ఉపేందర్, ఎంపీటీసీ కనుక అంజయ్య, ఎంపీడీవో యాదగిరిగౌడ్ పాల్గొన్నారు. అనంతంర నక్కలపల్లిలో నిర్మిస్తున్న డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రూం ఇండ్లను పరిశీలించారు. పూర్తైన ఇండ్లను అర్హులకు పంపిణీ చేయాలని సూచించారు. 

రోడ్డు పనులను స్పీడప్‌‌‌‌‌‌‌‌ చేయాలి

నకిరేకల్‌‌‌‌‌‌‌‌, వెలుగు : నల్గొండ పట్టణంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులు, సెంట్రల్‌‌‌‌‌‌‌‌ లైటింగ్‌‌‌‌‌‌‌‌ పనులపై ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శుక్రవారం రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు వెడల్పు పనులను స్పీడప్‌‌‌‌‌‌‌‌ చేయాలని ఆదేశించారు. నకిరేకల్‌‌‌‌‌‌‌‌ పట్టణ సుందరీకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్‌‌‌‌‌‌‌‌  రాచకొండ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌, కమిషనర్‌‌‌‌‌‌‌‌ బాలాజీ పాల్గొన్నారు.

నుడా క్యాపిటలైజేషన్‌‌‌‌‌‌‌‌ చార్జీలు ఎత్తివేయాలి

నల్గొండ అర్బన్‌‌‌‌‌‌‌‌, వెలుగు : నీలగిరి అర్బన్‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ అథారిటీ విధించిన క్యాపిటలైజేషన్‌‌‌‌‌‌‌‌ చార్జీలను వెంటనే ఎత్తివేయాలని క్రెడాయ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రేమ్‌‌‌‌‌‌‌‌ సాగర్‌‌‌‌‌‌‌‌రెడ్డి కోరారు. క్రెడాయ్‌‌‌‌‌‌‌‌ నల్గొండ చాప్టర్‌‌‌‌‌‌‌‌ అధ్యక్షుడు బండారు ప్రసాద్‌‌‌‌‌‌‌‌ అధ్యక్షతన శుక్రవారం పట్టణంలో జరిగిన మీటింగ్‌‌‌‌‌‌‌‌లో ప్రేమ్‌‌‌‌‌‌‌‌ సాగర్‌‌‌‌‌‌‌‌రెడ్డి మాట్లాడారు. నల్గొండ పట్టణ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు క్రెడాయ్‌‌‌‌‌‌‌‌ ప్రతినిధులు కృషి చేస్తున్నట్లు చెప్పారు. మరో ఏడాది, రెండేళ్లలో నల్గొండ సైతం చెందే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా రియల్‌‌‌‌‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌‌‌‌‌ డెవలపర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రేమ్‌‌‌‌‌‌‌‌సాగర్‌‌‌‌‌‌‌‌ దృష్టికి తీసుకెళ్లగా ప్రభుత్వంతో చర్చించి సమస్యల పరిష్కారానికి కృ-షి చేస్తామన్నారు. అనంతరం క్యాపిటలైజేషన్‌‌‌‌‌‌‌‌ చార్జీలు తొలగించాలని నల్గొండ మున్సిపల్‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌, నుడా వైస్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ రమణాచారికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగన్మోహన్, ఏచూరి భాస్కర్, శరత్‌‌‌‌‌‌‌‌బాబు, కొలను రాజేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, దూదిపాల వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డి, నాంపల్లి మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

నీటి వృథాను అరికట్టేందుకే ఆన్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ సిస్టమ్‌‌‌‌‌‌‌‌

మిర్యాలగూడ, వెలుగు : నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో నీటి వృథాను అరికట్టేందుకే మిషన్‌‌‌‌‌‌‌‌ భగీరథ నల్లాలకు ఆన్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ సిస్టమ్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌‌‌‌‌‌‌‌రావు చెప్పారు. పట్టణంలోని 48వ వార్డులో నల్లాలు అమర్చే ప్రక్రియను శుక్రవారం మున్సిపల్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ తిరునగరు భార్గవ్‌‌‌‌‌‌‌‌, వైస్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ కుర్ర విష్ణుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మిషన్‌‌‌‌‌‌‌‌ భగీరథ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌ రవీంద్రసాగర్‌‌‌‌‌‌‌‌, డీఈ సాయిలక్ష్మి, వార్డు అధ్యక్షుడు నూనె రవికుమార్, పోగుల నవీన్, ఎండీ.హబీబ్ పాల్గొన్నారు.

డబుల్‌‌‌‌‌‌‌‌ ఇండ్లను త్వరగా పూర్తి చేయాలి

నల్గొండ అర్బన్​, వెలుగు : నల్గొండ జిల్లా దేవరకొండలో నిర్మిస్తున్న డబుల్‌‌‌‌‌‌‌‌ ఇండ్లను రెండు నెలల్లో పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని కలెక్టర్‌‌‌‌‌‌‌‌ టి.వినయ్‌‌‌‌‌‌‌‌ కృష్ణారెడ్డి ఆదేశించారు. దేవరకొండలో డబుల్‌‌‌‌‌‌‌‌ ఇండ్ల ప్రగతి, పోడు సమస్యలు, ఆర్‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ పనులపై శుక్రవారం ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌‌‌‌‌‌‌‌తో కలిసి కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో రివ్యూ చేశారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు 210 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించినట్లు ఆఫీసర్లు వివరించారు. నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో అటవీ యాజమాన్య హక్కు పత్రాలు ఉన్న వారిని సైతం ఆఫీసర్లు భూమి వద్దకు రానివ్వడం లేదని ఎమ్మెల్యే చెప్పారు. స్పందించిన కలెక్టర్‌‌‌‌‌‌‌‌ ఆర్డీవో, ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌, ఎస్టీ వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌గా ఏర్పడి సమస్యను పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ భాస్కర్‌‌‌‌‌‌‌‌రావు, రోహిత్‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌‌‌‌‌ ఉన్నారు.

బీజేపీలో చేరికలు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేట గ్రామానికి చెందిన పలువురు శుక్రవారం బీజేపీలో చేరారు. వారికి ఆ పార్టీ నాయకుడు వట్టిపల్లి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ పేరు నుంచి తెలంగాణ పదాన్ని తొలగించిన కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రాష్ట్ర ప్రజలతో బంధం తెగిపోయినట్లేనని అన్నారు. ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజల దృష్టిని మరల్చేందుకే బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరుతో డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఆలేరు సహా రాష్ట్రంలో బీజేపీ విజయం సాధించడం  ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో చేరిన వారిలో సీపీఐ మండల కార్యవర్గ సభ్యుడు పుల్లె నరేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు పలువురు కార్యకర్తలు ఉన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కోశాధికారి కాదూరి అచ్చయ్య, మండల అధ్యక్షుడు కళ్లెం శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నాయకులు కోల వెంకటేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మండల ప్రధాన కార్యదర్శి నేరెళ్ల సంతోష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గుప్తా పాల్గొన్నారు.

ఎయిడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ప్రజలకు అవగాహన కల్పించాలి

సూర్యాపేట, వెలుగు : ఎయిడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని సూర్యాపేట జిల్లా యువజన, క్రీడల అధికారి వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి సూచించారు. యువజన వ్యవహారాలు, కేంద్ర క్రీడల మంత్రిత్వశాఖ, నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం సూర్యాపేటలోని ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వీ డిగ్రీ కాలేజీలో ఎయిడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత తమ గ్రామాల్లో ప్రజలను సైతం చైతన్యపరచాలని సూచించారు. సదస్సులో నెహ్రూ యువకేంద్రం ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రవీణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రిన్సిపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటేశులు, మధు, కొండానాయక్ పాల్గొన్నారు.