ఈ-మోటార్ సైకిల్ ను లాంచ్ చేసిన అటు మొబైల్ సంస్థ

ఈ-మోటార్ సైకిల్ ను లాంచ్ చేసిన అటు మొబైల్ సంస్థ

సంగారెడ్డి: కాలుష్య రహితంగా పెట్రోల్, డీజిల్ వినియోగం లేకుండా బ్యాటరీతో నడిచే సరికొత్త మోటార్ సైకిల్ ‘ఆటమ్ 1.0’ ని ప్రారంభించింది ఆటు మొబైల్ సంస్థ. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం వెలిమెల గ్రామంలో దీన్ని లాంచ్ చేశారు. దేశంలో దొరికే సామాగ్రితో ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ బైక్ గా దీన్ని రూపొందించారు. ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా.. ప్రభుత్వ గుర్తింపు పొందిన లైసెన్స్ తో మార్కెట్లో కి రిలీజ్ చేస్తున్నామన్నారు కంపెనీ ఎండీ వంశీకృష్ణ.    ఈ బైక్ 25 కిలోమీటర్ల స్పీడ్ తో వెళుతుందని…. 150 కిలోల బరువు మోస్తుందన్నారు. ఒకసారి బ్యాటరీ ఫుల్ గా ఛార్జింగ్ అయితే 100 కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తుందని తెలిపారు.  మోటార్ సైకిల్ ధర రూ.50వేలు ఉంటుందన్నారు.

Atumobile Electric Bike ATUM Launch In Sangareddy