
- 5న కలెక్టరేట్ల ముందు ధర్నాలకు లెఫ్ట్ పార్టీల పిలుపు
హైదరాబాద్, వెలుగు: బొగ్గు గనుల వేలం పాటను రద్దు చేయాలని, నేరుగా సింగరేణికే ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. సోమవారం సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్లో లెఫ్ట్ పార్టీల నేతలు సమావేశమయ్యారు. ఈ నెల 5న అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేయాలని డిసైడ్ అయ్యారు. అదే రోజు హైదరాబాద్ లోని సింగరేణి భవన్ వద్ద ధర్నాలు నిర్వహించాలని నేతలు మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నారు.
ఈ నిరసనల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో లెఫ్ట్ పార్టీల నేతలు ఎస్. వీరయ్య, డీజీ నర్సింహారావు (సీపీఎం), ఈటీ నర్సింహా (సీపీఐ), రమ, రామచందర్ (మాస్ లైన్), గోవర్ధన్, శ్రీనివాస్, పాపయ్య (న్యూ డెమోక్రసీ), తదితరులు పాల్గొన్నారు.