ఇప్పుడు పైసలు కడితే.. 18 నెలలకు ఇస్తరట

ఇప్పుడు పైసలు కడితే.. 18 నెలలకు ఇస్తరట
  • ఇప్పుడు పైసలు కడితే.. 18 నెలలకు ఇస్తరట
  • ప్లాట్ల అమ్మకాల్లో హెచ్ఎండీఏ తీరిది
  • కొనుగోలుదారులు కట్టిన  డబ్బుల తోనే ప్లాట్లు 
  • డెవలప్ చేసే ప్లాన్ డబ్బులు కట్టి, రిజిస్ట్రేషన్ చేశాక ఎందుకియ్యరని 
  • అడుగుతున్న జనం డెవలప్ చేయకుండా  వేలం ఎందుకని నిలదీత


హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కారు ఆమ్దానీ పెంచుకోవటం కోసం నిర్వహిస్తున్న ప్లాట్ల వేలం విమర్శలకు తావిస్తున్నది. ‘ప్రీ లాంచ్’ పద్ధతిలో ప్లాట్లను విక్రయిస్తుండటంపై జనం నుంచి వ్యతిరేకత వస్తున్నది. వేలంలో ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దక్కించుకుని, డబ్బులు మొత్తం కట్టి, రిజిస్ట్రేషన్ చేయించుకున్నా ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొనుగోలుదారుడికి హెచ్ఎండీఏ  వెంటనే అప్పగించదు. 18 నెలల తర్వాతే అప్పగిస్తమని తమ బ్రోచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హెచ్ఎండీఏ పేర్కొంది. కొనుగోలుదారులు కట్టిన డబ్బులతో ప్లాట్లను డెవలప్ చేసి వారికి అప్పగించాలని ప్లాన్ చేస్తోంది. దీనిపై జనం మండిపడుతున్నారు. డబ్బులు కట్టి, రిజిస్ట్రేషన్ చేశాక ప్లాట్ ఎందుకియ్యరని ప్రశ్నిస్తున్నారు. డెవలప్ చేయకుండా వేలం ఎందుకు వేస్తున్నారని నిలదీస్తున్నారు.

55 ఎకరాల్లో హెచ్ఎండీఏ లేఅవుట్

మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో 55 ఎకరాల 12 గుంటల్లో (434 ప్లాట్స్) హెచ్ఎండీఏ లేఅవుట్ చేసింది. ఈ ప్లాట్లను వచ్చే నెల 6న ఆన్ లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వేలం వేయనుంది. దీనిపై ఇటీవల అధికారులు ప్రీ బిడ్ మీటింగ్ నిర్వహించారు. వేలంలో ప్లాట్ దక్కించుకున్న వారు వారంలోగా ప్లాట్ వ్యాల్యూలో 25 శాతం చెల్లించాలి. మిగతా అమౌంట్ 3 నెలల్లో చెల్లించాల్సి ఉంటుంది. 300 చదరపు గజాల ప్లాట్ వేలానికి రూ.లక్ష ఈఎండీ అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి మొత్తం చెల్లించాకే రిజిస్ట్రేషన్ చేస్తారు. కానీ వెంటనే ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇవ్వరు. దీంతో డబ్బులు కట్టిన తర్వాత ఎందుకు ఇవ్వరని పలువురు ప్రశ్నిస్తున్నారు. నిజానికి హెచ్ఎండీఏ వేలం వేస్తున్న లే అవుట్ లో కనీస వసతులు లేవు. సీసీరోడ్లు లేకపోవటం, బండ రాళ్లు ఉండటం తదితర సమస్యలు ఉన్నాయి. కేవలం ప్లాట్ల దగ్గర బోర్డులు పెట్టి వదిలేశారు. చుట్టూ గోడ లేదా ఫెన్సింగ్ కూడా లేదు. రాళ్లు తొలగించి ప్లాట్లను చదును చేయలేదు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, కరెంట్ సదుపాయం ఏర్పాటుకు చాలా టైమ్ పడుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వేలంలో వచ్చిన నగదుతో హెచ్ఎండీఏ లే అవుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డెవలప్ చేయాలని ప్లాన్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

6 నెలల్లో ఇవ్వాలి

డైరెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ప్రభుత్వం ప్లాట్లు వేలం వేస్తున్నదని, అవి కొన్నా ఎలాంటి లీగల్ సమస్యలు రావని హెచ్ఎండీఏ  వేలంలో పాల్గొంటున్నం. 18 నెలల తర్వాత ప్లాట్ మాకు ఇవ్వకపోతే ఏం చేయాలి. దీనిపై అధికారులు స్పష్టత ఇవ్వలేదు. ఇల్లు కట్టుకోవాలనుకునే వారు 18 నెలలు ఎట్ల ఆగుతరు? ఒక వేళ ప్రభుత్వం మారితే పరిస్థితి ఏంటి? 6 నెలల్లో ప్లాట్ ఇవ్వాలి. 
- వెంకటేశ్, ఉప్పల్ 
(ప్రీ బిడ్ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు హాజరైన వ్యక్తి)