సాయి సింహాద్రి హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘సన్ ఆఫ్’. బత్తుల సతీష్ దర్శకుడు. ఫిబ్రవరి 27న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోందని టీమ్ తెలియజేసింది. తండ్రీ కొడుకుల మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్‌కు ఆడియెన్స్ కనెక్ట్ అవుతున్నారని ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో సాయి సింహాద్రి అన్నాడు. ఈ చిత్రంతో నటిగా తనకు మంచి గుర్తింపు వస్తుందని హీరోయిన్ మీరా రాజ్ చెప్పింది. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ కార్యదర్శి తుమ్మల ప్రసన్నకుమార్, డిస్ట్రిబ్యూటర్ శోభారాణి తదితరులు పాల్గొన్నారు.
