
న్యూఢిల్లీ : టోకు ధరల ఆధారిత ఇన్ఫ్లేషన్ ఆగస్టులో వరుసగా ఐదవ నెలలో –0.52 శాతం వద్ద నెగెటివ్ జోన్లోనే ఉంది. అయితే ఆహార వస్తువులు, ఇంధనం ధరలు పెరిగాయి. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్(డబ్ల్యూపీఐ) ఆధారిత ఇన్ఫ్లేషన్ రేటు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నెగెటివ్గానే ఉంది. ఇది జూలైలో 1.36 శాతంగా ఉంది. గతేడాది ఆగస్టులో డబ్ల్యూపీఐ 12.48 శాతంగా ఉంది.
ఆహార వస్తువుల ఇన్ఫ్లేషన్ ఆగస్టులో 10.60 శాతం వద్ద రెండంకెల స్థాయిలో ఉంది. జులైలో 14.25 శాతం వరకు ఉంది. ఆగస్టులో ఇన్ఫ్లేషన్ ప్రతికూల రేటుకు మినరల్ ఆయిల్స్, బేసిక్ మెటల్స్, కెమికల్ & కెమికల్ ప్రొడక్ట్స్, టెక్స్‌టైల్స్ ఫుడ్ ప్రొడక్ట్స్ ధరల తగ్గుదలే కారణమని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫ్యూయల్, పవర్ ఇన్ఫ్లేషన్ ఆగస్టులో 6.03 శాతంగా ఉంది. జులైలో 12.79 శాతంగా ఉంది. ఆగస్టులో మాన్యుఫాక్చర్డ్ ప్రొడక్టులలో ఇన్ఫ్లేషన్ రేటు 2.37 శాతం, జులైలో 2.51 శాతం ఉంది.