తల నొప్పి మందులు రీకాల్ చేస్తున్న అరబిందో

తల నొప్పి మందులు రీకాల్ చేస్తున్న అరబిందో

న్యూఢిల్లీ: అరబిందో ఫార్మా అమెరికా మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 4,600 బాటిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పైగా నొప్పి నివారణ మందును రీకాల్ చేస్తోంది.  తయారీలో సమస్యలు ఉన్నాయని, అందుకే రీకాల్ చేపడుతోందని యూఎస్ ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఏ తెలిపింది. అరబిందో ఫార్మా యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సబ్సిడరీ  4,608 బాటిల్స్ ఆసిటమినోఫెన్ టాబ్లెట్స్ (325 ఎంజీ)ను కరెంట్ గుడ్ మాన్యుఫాక్చరింగ్ ప్రాక్టీసెస్ (సీజీఎంపీ) ఉల్లంఘనల కారణంగా రీకాల్ చేస్తోంది.  టాబ్లెట్ల రంగు మారినట్టు కస్టమర్లు ఫిర్యాదు చేశారని ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఏ పేర్కొంది.  ఈ మందును  తలనొప్పి, మైగ్రేన్, దంతాల నొప్పి, వీపు నొప్పి, కండరాల నొప్పి నివారణకు ఉపయోగిస్తారు.  ఈ రీకాల్ ప్రాసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  మే 22, 2025న ప్రారంభమైంది. అరబిందో ఫార్మా షేర్లు శుక్రవారం రూ. 1,124 వద్ద ఫ్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ముగిశాయి.