IND VS AUS : ఆసీస్ ఆలౌట్.. ఒక్కరూ యాభై దాటలే

IND VS AUS : ఆసీస్ ఆలౌట్.. ఒక్కరూ యాభై దాటలే

చెన్నై వేదికగా జరుగుతున్న భారత్, ఆస్ట్రేలియా చివరి వన్డేలో ఆసీస్ 269 పరుగులకి ఆలౌట్ అయింది. భారత బౌలర్ల దాటికి ఏ ఒక్క ఆసీస్ బౌలర్ కూడా హాఫ్ సెంచరీ చేయలేకపోయారు. దాంతో 49 ఓవర్లలోనే ఆస్ట్రేలియా కుప్పకూలింది. టీమిండియా బౌలర్లలో హార్దిక్, కుల్దీప్ 3 వికెట్లు తీసుకున్నారు. సిరాజ్, అక్షర్ లకు రెండు వికెట్లు దక్కాయి. 

హార్దిక్ గేమ్ చేంజ్: 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ దాటిగానే ఆడింది. బ్యాటింగ్ పిచ్ పై ఆసీస్ బ్యాటర్లు దూకుడుగా ఆడారు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (33, 31 బంతుల్లో), మిచెల్ మార్ష్ (47, 47 బంతుల్లో) మొదటి ఓవర్ నుంచే దాటిగా ఆడారు. పేస్, స్పిన్ అని తేడా లేకుండా బౌలర్లను టార్గెట్ చేస్తూ బౌండరీలు రాబట్టారు. దీంతో 10 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ 68 పరుగులు చేసింది. తర్వాత ఓవర్ వేసిన హార్దిక్.. దూకుడుగా ఆడుతున్న ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ ను వెంట వెంటనే ఔట్ చేసి భారత్ ను మళ్లీ గేమ్ లోకి తీసుకొచ్చాడు.

కుల్దీప్ కమాల్ :

తర్వాత ఆసీస్ వికెట్ల ప్రవాహాన్ని ఎవరూ ఆపలేకపోయారు. కవర్స్ లో భారీ షాట్ ఆడబోయిన స్మిత్ (0) కీపర్ కేఎల్ రాహుల్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక అప్పటినుంచి టీమిండియా జోరు పెంచింది. పొదుపుగా బౌలింగ్ చేస్తూ.. ఆసీస్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. హార్దిక్ తో వచ్చిన జోరును కుల్దీప్ యాదవ్ కొనసాగించాడు. డేవిడ్ వార్నర్ (23), లబుషేన్ (28), అలెక్స్ క్యారీ (38) ని వరుసగా పెవిలియన్ చేర్చాడు. అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్ కూడా సూపర్ బౌలింగ్ చేశారు. ఇద్దరు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. బౌండరీలు బాదుతూ జోరు మీదున్న అబాట్ (26), స్టోయినిస్ (25)ను అక్షర్ పెవిలియన్ చేర్చాడు. దీంతో ఆసీస్ 49 ఓవర్లలలో 269 పరుగులకి ఆలౌట్ అయింది.