ఆరుగురిని ఇంటికి పంపించేశారు: చివరి మూడు టీ20 లకు ఆస్ట్రేలియా జట్టు ఇదే

ఆరుగురిని ఇంటికి పంపించేశారు: చివరి మూడు టీ20 లకు ఆస్ట్రేలియా జట్టు ఇదే

భారత్ తో 5 టీ20 ల సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా తొలి రెండు మ్యాచ్ లు ఓడిపోయిన సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్ లో పర్వాలేదనిపించిన ఆసీస్.. రెండో మ్యాచ్ లో మాత్రం పూర్తిగా తేలిపోయింది. సిరీస్ గెలవాలంటే చివరి మూడు మ్యాచ్ లు తప్పక గెలవాల్సిన ఆసీస్ జట్టులో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఏకంగా ఆరుగురు ప్లేయర్లను స్వదేశానికి పంపిస్తున్నట్లు ప్రకటించారు. 

స్టీవ్ స్మిత్, ఆడమ్ జంపా ఇప్పటికే స్వదేశానికి తిరిగి వెళ్లారని క్రికెట్ ఆస్ట్రేలియా.కామ్.ఎయు నివేదించింది. గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, జోష్ ఇంగ్లిస్, సీన్ అబాట్ నేడు(నవంబర్ 28) గౌహతిలో జరగనున్న మూడవ T20I తర్వాత బుధవారం(నవంబర్ 29) స్వదేశానికి పయనమవుతారని ఆస్ట్రేలియా క్రికెట్ తెలియజేసింది. ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత 7గురు ఆసీస్ ఆటగాళ్లు టీమిండియాతో  టీ20 సిరీస్ కోసం భారత్ లోనే ఉన్నారు. వీరిలో 6 గురు మూడో టీ20 తర్వాత ఆసీస్ జట్టులో ఉండరు. 

వరల్డ్ కప్ లో సెంచరీతో ఆసీస్ కు టైటిల్ అందించిన ట్రావిస్ హెడ్ మాత్రమే ప్రస్తుతం వరల్డ్ కప్ జట్టులో సభ్యుడు. హెడ్ తొలి రెండు టీ20 మ్యాచ్ లకు రెస్ట్ తీసుకున్నాడు. నేడు జరిగే మూడో టీ 20 మ్యాచ్ కోసం బరిలోకి దిగనున్నాడు. చివరి మూడు టీ20లకు ఆసీస్ జట్టులో మెక్ డెర్మాట్,క్రిస్ గ్రీన్, జోష్ పిలిప్పీ లాంటి యువ ఆటగాళ్లు ఆసీస్ జట్టులో చోటు సంపాదించారు. ఇక ఈ సిరీస్ లో మూడో టీ20 నేడు(నవంబర్ 28) గౌహతి వేదికగా జరుగుతుంది.