IND vs AUS : మూడో సెషన్లో పట్టు బిగించిన టీమిండియా.. నిలకడగా ఆడుతున్న ఆసీస్

IND vs AUS : మూడో సెషన్లో పట్టు బిగించిన టీమిండియా.. నిలకడగా ఆడుతున్న ఆసీస్

ఆహ్మదాబాద్ లో జరుగుతున్న భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ లో ఆసీస్ బ్యాటర్లు సత్తా చాటుతున్నారు. నిదానంగా ఆడుతూ పరుగులు రాబడుతున్నారు. వికెట్ ఇవ్వకుండా భారత బౌలర్ల దాటిని ఎదుర్కొంటున్నారు. దీంతో రెండు సెషన్లు ముగిసినా ఆసీస్ కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయింది. ఉస్మాన్ ఖవాజా (67, 194 బంతుల్లో), కెప్టెన్ స్టీవ్ స్మిత్ (38,135 బంతుల్లో) మరొక వికెట్ పడకుండా జాగ్రత్తా ఇన్నింగ్స్ ను నడిపించారు. అయితే, మూడో సెషన్ భారత్ కు కలిసొచ్చింది. సెషన్ ప్రారంభం కావడంతోనే వికెట్లు తీయడం మొదలుపెట్టింది. స్టీవ్ స్మిత్, పీటర్ హ్యాండ్స్ (17) కొంబ్ ను వెంటవెంటనే ఔట్ చేసి ఇన్నింగ్స్ పై కాస్త పట్టు సాధించింది.

సుదీర్ఘ ఇన్నింగ్స్ తర్వాత ఆసీస్ మూడో సెషన్  మొదలుపెట్టింది. భారీ బాగస్వామ్యం నెలకొల్పాలి అనుకున్న ఆసీస్ కు జడేజా ఎదురుదెబ్బ కొట్టాడు. మూడో సెషన్ ప్రారంభం కాగానే కెప్టెన్ స్టీవ్ స్మిత్ ను బోల్డ్ చేసి పెవిలియన్ చేర్చాడు. దాదాపు 40 ఓవర్ల తర్వాత ఆసీస్ వికెట్ కోల్పోయింది.

టీమిండియా బౌలర్లు ఆసీస్ బ్యాటర్ వికెట్ తీయడం కోసం తంటాలు పడ్డారు. పిచ్ కొంత బౌలింగ్ కు సహకరిస్తున్నప్పటికీ వికెట్లు తీయడానికి తంటాలు పడ్డారు. స్పిన్, పేస్ తో ఎదురుదాడి చేసినా వాటిని ఆసీస్ బ్యాటర్లు గట్టిగా ఎదురుకున్నారు. భారత బౌలర్లలో షమీ 2, అశ్విన్, జడేజా చేరో వికెట్ పడగొట్టారు.  ప్రస్తుతం ఆస్ట్రేలియా 174/4 పరుగలతో ఉంది.