మీరు నాపెళ్లికి రాలేదు.. ఫైన్​ కట్టండి...

మీరు నాపెళ్లికి రాలేదు.. ఫైన్​ కట్టండి...

పెళ్లికి రాని వారిని జరిమానా కట్టాలని ఆస్ట్రేలియాకు చెందిన వధువు ఆహ్వానితులకు తెలిపింది.  తాను ఎంతో ఖర్చు పెట్టి వివాహవేదికను పెళ్లి విందును రడీ చేశానని నా పెళ్లికి రానందుకు నోషో పేరుతో ఫైన్​ విధించింది.  

మీకు పెళ్లి ఆహ్వానం వస్తే ఖచ్చితంగా అటెండ్​ అవ్వండి. లేకపోతే మీరు ఫైన్ కట్టాల్సి రావచ్చు. పెళ్లికి వెళ్లకపోతే ఫైన్​ ఏంటనుకుంటున్నారా..   ఇప్పుడు సోషల్​ మీడియాలో ఇదే చర్చ జరుగుతుంది. 

ఎవరింట్లోనైనా పెళ్లి జరుగుతుందంటే సాధారణంగా  బంధువులకు, మిత్రులకు,  పెళ్లి శుభలేఖను ప్రింట్​ చేయించి వారి చిరునామాకు పంపుతాము.  అలా పంపిన వారిలో కొంతమంది  వేడుకకు హాజరవుతారు.  మరి కొంతమంది హాజరు కారు.  అయితే బాగా దగ్గరి వారైతే రాకపోతే వారి మధ్య బంధం చెడిపోకుండా ఉండేందుకు  ఎందుకు రావడం లేదో ఆ కుటుంబ సభ్యులకు వివరణ ఇస్తారు.  ఇప్పడు  ఆస్ట్రేలియాకు చెందిన వధువు   ఆహ్వానాలు పంపినా .. తనపెళ్లికి రాని అతిథులకు జరిమానా విధించిన ఘటన చోటు చేసుకుంది. 

తాను  అందరికి ముందుగానే కమ్యూనికేట్​చేసినప్పటికి పెళ్లికి రాకపోయే సరికి వధువు అతిథులకు ఫైన్​ వేసింది. పెళ్లికి పెద్ద కళ్యాణ మండపాన్ని... ప్రత్యేకమైన ఆహారాన్ని తయారు చేయించానని తెలిపింది.  ఇదంతా వృధా కావడంతో ఆహ్వానం పంపిన వారే కట్టాలని తెలిపింది.  కొంతమంది ఏవో సాకులు చెబుతూ రాలేదని.. దీంతో నిరుత్సాహానికి గురైన వధువు నోషో రుసుమును వారి నుంచి వసూలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయం తెలిసిన బంధువులు, స్నేహితులు ఏంట్రా ఇది  ఆశ్చర్యపోతున్నారు.