ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్‌వార్న్ గుండెపోటుతో మృతి

ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్‌వార్న్ గుండెపోటుతో మృతి

ఆస్ట్రేలియా క్రికెట్‌కు ఎంతో వ‌న్నెతెచ్చిన అద్భుత స్పిన్న‌ర్ షేన్ వార్న్(52) ఇక లేరు. ఆయ‌న గుండెపోటుతో ఇవాళ (శుక్రవారం) చ‌నిపోయిన‌ట్టు ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ తెలిపింది. థాయ్‌లాండ్‌లో ఉన్న ఆయనకు శుక్రవారం గుండెపోటు రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వార్న్ చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు.

ఆస్ట్రేలియా తరపున షేన్ వార్న్ మొత్తం 145 టెస్టులు ఆడారు. అందులో 708 వికెట్లు తీసి ఆయన రికార్డు సృష్టించారు. 194 వన్డేల్లో 293 వికెట్లు తీసుకుని సంచలనానికి మారుపేరుగా నిలిచారు షేన్​వార్న్. ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్ కు కెప్టెన్ గా వ్యవహరించారు. వార్న్ మృతి పట్ల ఆస్ట్రేలియాతో పాటు..ఐసీసీ విచారం వ్యక్తం చేసింది. పలువురు క్రికెటర్లు సానుభూతి వ్యక్తం చేశారు.​

మరిన్ని వార్తల కోసం..

ఐసీసీ ర్యాంకింగ్స్: టాప్‌ 10 నుంచి కోహ్లీ, రోహిత్‌ ఔట్‌

మరిన్ని వార్తలు