ఐసీసీ ర్యాంకింగ్స్: టాప్‌ 10 నుంచి కోహ్లీ, రోహిత్‌ ఔట్‌

ఐసీసీ ర్యాంకింగ్స్: టాప్‌ 10 నుంచి కోహ్లీ, రోహిత్‌ ఔట్‌

ఇంటర్నేషనల్  క్రికెట్ కౌన్సిల్ (ICC) లేటెస్టుగా టీ20 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌ విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్ లో  టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ టాప్‌ 10 నుంచి పడిపోయారు. అదే సమయంలో శ్రీలంకతో టీ20 సిరీస్‌లో అదరగొట్టిన శ్రేయస్‌ అయ్యర్‌ ఏకంగా .. 27 స్థానాలు ఎగబాకి.. 18వ ర్యాంకుకు చేరుకున్నాడు.టాప్‌ 10లో భారత్‌ నుంచి ఒక్క కేఎల్‌ రాహుల్‌కు మాత్రమే స్థానం దక్కింది.

 ఇక బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో అయితే భారత్‌ నుంచి టాప్‌ 10లో ఏ ఒక్కరికి కూడా చోటు దక్కలేదు. భువనేశ్వర్‌ కుమార్‌ మాత్రం టాప్‌ 20లో ఉన్నాడు. ఐసీసీ టీ20 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో.. భారత్‌ నుంచి కేఎల్‌ రాహుల్‌ టాప్‌ 10లో ఉన్నాడు. అతని ఖాతాలో 646 రేటింగ్‌ పాయింట్లు ఉన్నాయి.  ఆ తర్వాత  కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 13వ స్థానానికి, మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ 15వ స్థానానికి పడిపోయారు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ శ్రీలంకతో సిరిసీలో 50 పరుగులు మాత్రమే చేశాడు. ఒక విరాట్‌ కోహ్లీ వెస్టిండీస్‌తో రెండో టీ20 మ్యాచ్‌  తర్వాత  మళ్లీ ఆడలేదు. 

మరిన్ని వార్తల కోసం..

ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ కన్నుమూత