
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో చేజారిన టాప్ పొజిషన్
న్యూఢిల్లీ: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో నంబర్ వన్ గా కొనసాగుతున్న టీమిండియా స్పీడ్ కు ఆస్ట్రేలియా బ్రేక్ వేసింది. 42 వారాలుగా టాప్ పొజిషన్ లో కొనసాగిన కోహ్లీ కెప్టెన్సీలోని మెన్ ఇన్ బ్లూ మూడో స్థానానికి దిగజారింది. తాజాగా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ ను ప్రకటించింది. ఈ ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా (116) ఫస్ట్ ప్లేస్ దక్కించుకోగా.. న్యూజిలాండ్ (115), ఇండియా (114) రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. 2016 అక్టోబర్ లో ఇండియా ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది. 2016–17 సీజన్ లో 12 టెస్టుల్లో గెలిచి, ఒక్క మ్యాచ్ మాత్రమే ఓడటంతో ఇండియా టాప్ కు చేరింది. టాప్ పొజిషన్ లో ఎక్కువ కాలం ఉన్న జట్టుగా ఆస్ట్రేలియాను చెప్పొచ్చు. 2001–09 వరకు 95 వారాల పాటు కంగారూ టీమ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఆ లిస్ట్ లో సెకండ్ ప్లేస్ లో నిలిచిన వెస్టిండీస్ (1981–88) 89 వారాల పాటు టాప్ పొజిషన్ ను కాపాడుకుంది.