ODI World Cup 2023: చివరి బాల్ వరకు నరాలు తెగే ఉత్కంఠ.. 5 పరుగుల తేడాతో కివీస్ ఓటమి..

ODI World Cup 2023: చివరి బాల్ వరకు నరాలు తెగే ఉత్కంఠ.. 5 పరుగుల తేడాతో కివీస్ ఓటమి..

వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా మరో కీలక విజయాన్ని సాధించింది. ధర్మశాలలో న్యూజిలాండ్ తో  జరిగిన ఈ మ్యాచ్ లో 5 పరుగుల తేడాతో  థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. భారీ స్కోర్ చేసి కూల్ గా ఉన్న ఆస్ట్రేలియాను కివీస్ హడలెత్తించి నా.. లక్ష్యం మరీ పెద్దది కావడంతో న్యూజీలాండ్ కు పరాజయం తప్పలేదు. ఈ విజయంతో వరల్డ్ కప్ లో ఆసీస్ వరుసగా నాలుగో విజయాన్ని సొంతం చేసుకోగా.. న్యూజిలాండ్ వరుసగా రెండో పరాజయాన్ని చవి చూసింది.

టాస్ గెలిచి కివీస్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 388 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (109) భారీ సెంచరీకి తోడు మరో ఓపెనర్ వార్నర్ (82) హాఫ్ సెంచరీ చేసాడు. వీరిద్దరూ న్యూజీలాండ్ బౌలర్లను ఒక ఆటాడుకుంటూ తొలి వికెట్ కు 19 ఓవర్లలోనే 175 పరుగులు జోడించారు. మిడిల్ ఆర్డర్ విఫలమైన చివర్లో మ్యాక్స్ వెల్(41), కమ్మిన్స్(37), ఇంగ్లిస్(38) మెరుపులు మెరిపించడంతో కివీస్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.

ఇక లక్ష్య ఛేదనలో కివీస్ బ్యాటర్లు ఆసీస్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. రాచీన్ రవీంద్రా తన అద్భుతమైన ఫామ్ ను కొనసాగిస్తూ సెంచరీ(116) చేయగా.. డారిల్ మిట్చెల్(54) హాఫ్ సెంచరీతో ఆసీస్ బౌలర్లకు చెమటలు పట్టించారు. ఇక చివర్లో నీషం(57) అసాధారణ పోరాటం కారణంగా కివీస్ గెలుపుపై ఆశలు పెంచినా.. విజయాన్ని మాత్రం ఆందించలేకపోయాడు. ఆసీస్ బౌలర్లలో జంపా మూడు వికెట్లు తీసుకోగా.. స్టార్క్ హాజెల్ వుడ్ కు రెండు వికెట్లు లభించాయి.         

ALSO READ : ODI World Cup 2023: కీలక మ్యాచ్‪లో చేతులెత్తేసిన నెదర్లాండ్స్.. బంగ్లా ముందు ఈజీ టార్గెట్